మరో 73 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-15T10:26:18+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లా ప్రజలను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నది. రోజుకు సరాసరి 50 నుంచి 100 వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

మరో 73 మందికి కరోనా

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరి మృతి

14న 100కు పైగానే వ్యాధిబారిన పడ్డట్లు సమాచారం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా మహమ్మారి జిల్లా ప్రజలను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నది. రోజుకు సరాసరి 50 నుంచి 100 వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జిల్లా వ్యాప్తంగా 73 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం బులిటెన్‌ విడుదల చేసింది. కరీంనగర్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన 50 సంవత్సరాల వయసు కలిగిన ఒకరికి ఈ నెల 12న కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. శుక్రవారం ఆయన మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం పట్టణంలోని కాపువాడలో ఐదుగురు, హౌసింగ్‌బోర్డుకాలనీలో ఒకరు, లక్ష్మీనగర్‌లో ఇద్దరు, మారుతీనగర్‌లో ఒకరు, బోయవాడలో ఒకరు, విద్యారణ్యపురిలో ముగ్గురు, చంద్రపురికాలనీలో ఇద్దరు, రైల్వేస్టేషన్‌ సమీపంలో ముగ్గురు, సరస్వతీనగర్‌లో ఒకరు, గణేశ్‌నగర్‌లో ఒకరు, తిరుమల్‌నగర్‌లో ఒకరు, కట్టరాంపూర్‌లో ముగ్గురు, భగత్‌నగర్‌లో ఆరుగురు, రాంచంద్రాపూర్‌ కాలనీలో ఒకరు, ఆరెపల్లిలో ఇద్దరు, సీతారాంపూర్‌లో ముగ్గురు, విద్యానగర్‌లో ఇద్దరు, హిందూపురికాలనీలో ఒకరు కరోనా వ్యాధిబారిన పడ్డారు. ఇందిరానగర్‌లో ముగ్గురికి, వావిలాలపల్లిలో ఇద్దరికి, బ్యాంకుకాలనీలో ఒకరికి, సుభాష్‌నగర్‌లో ఒకరికి, సాయినగర్‌లో ఒకరికి కరోనా వైరస్‌ సోకింది. జ్యోతినగర్‌ శివథియేటర్‌ సమీపంలోని అపార్టుమెంట్లలో ఏడుగురికి, కెమిస్ర్ఠీ భవన్‌ సమీపంలో ఒకరికి, రాధా నిలయం సమీపంలో ఇద్దరికి, కోర్టు వెనుక ప్రాంతంలో ఒకరికి, జ్యోతినగర్‌ పార్కు సమీపంలో ఒకరికి, శివనగర్‌లో ఒకరికి, శ్రీనగర్‌కాలనీలో ఐదుగురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. 


మండలాల్లో....

హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో 80 మందికి కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా అందులో 11 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో 47 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి  పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇల్లందకుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 18 మందికి పరీక్షలు చేయగా ఒకరికి వ్యాధి నిర్ధారణ అయింది. సైదాపూర్‌లో ఒకరికి, శంకరపట్నం మండలంలో ఒకరికి, తిమ్మాపూర్‌ మండలం మహాత్మనగర్‌లో 17 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా 8 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. మానకొండూర్‌లో ఇద్దరికి, రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో ఒకరికి, చొప్పదండిలో 8 మందికి, గంగాధరలో ఒకరికి,, కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని వల్లంపహాడ్‌లో ఒకరికి, నగునూరులో ఒకరికి, దుర్శేడ్‌లో ఒకరికి, బొమ్మకల్‌లో నలుగురికి, కొత్తపల్లి మండలంలోని రేకుర్తిలో ఇద్దరికి కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. 

Updated Date - 2020-08-15T10:26:18+05:30 IST