కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-16T05:21:45+05:30 IST

కరోనా కేసులు రోజు రోజుకు పెరు గుతున్నాయి.

కరోనా కల్లోలం
కల్వకుర్తిలో కరోనాతో మృతి చెందిన వ్యక్తిని ఖననం చేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

- తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా 

- మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలపై పడగ

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మరొకరి మృత్యువాత


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/గద్వాల క్రైం/నారా యణపేట క్రైం/కందనూలు/కల్వకుర్తి టౌన్‌/వనపర్తి వైద్య విభాగం, ఏప్రిల్‌ 15 : కరోనా కేసులు రోజు రోజుకు పెరు గుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 2,228 మందికి గురువారం కరోనా పరీక్షలు చేయగా, అందులో 444 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మండలాల వారీ గా అత్యధికంగా మహబూబ్‌నగర్‌ మండలంలో 186 మం దికి, దేవరకద్రలో 130 మందికి, జడ్చర్లలో 91 మందికి, భూత్పూర్‌లో 16 మందికి, మూసాపేటలో 23 మందికి, హన్వాడలో 21 మందికి, అడ్డాకులలో పది మందికి, బాలా నగర్‌లో 15 మందికి, కోయిల్‌కొండలో 14 మందికి, నవాబ్‌ పేటలో 15 మందికి కరోనా సోకింది. జిల్లా వ్యాప్తంగా 4,266 మంది కరోనా టీకా వేయించుకున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,791 మందికి పరీక్షలు చేయగా, అందులో 95 మంది వైరన్‌ నిర్ధారణ అయినట్లు కొవిడ్‌ ఇన్‌చార్జి ఇ ర్షాద్‌ తెలిపారు. జిల్లా కేంద్రాని కి చెందిన ఓ మ హిళ (50) కరోనాతో చికిత్స పొందుతూ కొవి డ్‌ వార్డులో మృతి చెందిం ది. జిల్లాలోని 13 వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో గురువారం 2,350 మంది టీకా వేయించుకున్నట్లు ప్రో గ్రాం అధికారి శశికళ చెప్పారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 34 కేంద్రాల్లో 3,360 మందికి కరోనా పరీక్షలు చేయగా, 231 వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అత్యధికం గా నాగర్‌కర్నూల్‌ మండలంలో 48 మం ది, లింగాలలో 28, అచ్చంపేటలో 25, కల్వ కుర్తిలో 22, బిజినేపల్లిలో 21, తెలకపల్లిలో 20 మందికి వై రస్‌ సోకింది. మిగిలిన కేసులు ఇతర మండలాల్లో నమోద య్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,444 మంది హోంఐసోలేషన్‌ లో ఉండగా, 18 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొం దుతున్నారు. జిల్లాలోని 34 కేంద్రాలలో 3,976 మందికి క రోనా టీకా వేశారు.

వనపర్తి జిల్లాలోని 16 కొవిడ్‌-19 నిర్ధార ణ కేంద్రాలలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 268 మంది కరో నా బారిన పడ్డార ని జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ అధికారి శ్రీనివాసులు తెలి పారు. 16 వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా 2,571 మంది కరోనా టీకాను తీసుకున్నారు. 

నారాయణపేట జిల్లాలో 1,463 మందికి కరోనా పరీక్ష లు చేయగా, 64 మందికి వైరస్‌ సోకింది. ఎడవెల్లిలో తొమ్మిది మంది, పెద్దజట్రంలో ఆరుగురు, నిడ్జింత లో నలుగురు, మీర్జాపూర్‌లో ఐదుగురు వైర స్‌ బారిన పడ్డారు. మిగిలిన 40 కే సులు ఆయా మండలాల్లో నమోదయ్యాయి.


కరోనా మృతుడికి అంత్యక్రియలు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని సిలార్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో శుక్రవారం మృతి చెందాడు. గత శనివారం ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఆయన గ్రామంలోని తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సాయంత్రం మునిసిపల్‌ సిబ్బంది ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-04-16T05:21:45+05:30 IST