ఆశ్రంలో కరోనా సదుపాయాలున్నాయా..?

ABN , First Publish Date - 2020-04-03T11:52:57+05:30 IST

ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కరోనా వైరస్‌ బాధితులకు ఎలాంటి వైద్య పరీక్షలు జరుగుతున్నాయో పరిశీలిం చాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎ.సత్య నారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

ఆశ్రంలో కరోనా   సదుపాయాలున్నాయా..?

హైకోర్టు ఆదేశాలతో జిల్లా జడ్జి తనిఖీ


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఏప్రిల్‌ 2 : ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కరోనా వైరస్‌ బాధితులకు ఎలాంటి వైద్య పరీక్షలు జరుగుతున్నాయో పరిశీలిం చాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎ.సత్య నారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి జడ్జి , మొదటి అదనపు జిల్లా జడ్జి టి.మల్లికార్జునరావు బుధవారం రాత్రి ఆశ్రం ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు ఎంత మంది ? అనుమానితులు ఎవరు ? ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం పీపీఈలు ఏర్పాటు చేసిందా ? ఐసోలేషన్‌ వార్డుల మాటేంటి ? ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌ ప్రకారం వైద్య సౌకర్యాలు అందిస్తున్నారా ? తదితర అంశాలపై పరిశీలన చేసి నివేదికను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి పంపారు.


ఇక్కడి వైద్య సిబ్బందికి పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్యూప్‌మెంట్‌ (పీపీఈ) లేవని ఓ న్యాయవాది హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌కు సంబంధించి హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. కరోనా అనుమానితులకు వైద్యం చేసేందుకు సరైన పీపీఈలు ప్రభుత్వం సమకూర్చకపోవడంతో 329 మంది ఆశ్రం వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, జిల్లా కలెక్టర్‌కు విన్నవించు కున్నారు. ఆయన స్పందించి 200 కిట్లను అందజేశారు. ఇప్పుడు వైద్యం చేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. 121 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వీరి నమూనాలను సేకరించి పంపించాం. ఎవరికైనా పాజి టివ్‌ వస్తే వీరిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపిస్తాం అని ఆశ్రం ఆసుపత్రి సీఈవో డాక్టర్‌ హనుమంతరావు తెలిపారు. 

Updated Date - 2020-04-03T11:52:57+05:30 IST