కేంద్రం ఖర్చులో కోత

ABN , First Publish Date - 2020-04-10T07:16:27+05:30 IST

ఇప్పటికే ఎంపీల జీతభత్యాల్లో కోత విధించిన కేంద్రం ఖర్చులను మరింత తగ్గించుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. బడ్జెట్‌లో..

కేంద్రం ఖర్చులో కోత

  • వ్యయంపై 15-20 శాతం నియంత్రణ
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఎంపీల జీతభత్యాల్లో కోత విధించిన కేంద్రం ఖర్చులను మరింత తగ్గించుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో 15 - 20ు వరకు ఖర్చుపై కేంద్ర ఆర్థిక శాఖ నియంత్రణ విధించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆఫీస్‌ మెమొరాండం జారీ చేసింది. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర సంస్థలను 3 కేటరిగీలుగా విభజించింది. కేటరిగి ’ఏ‘ పేర్కొన్న 18 శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోంచుకునే వెసులుబాటును కల్పించింది. కేటగిరి ’బీ’లో చేర్చిన 33 శాఖలకు 20ు,  కేటగిరి ‘సీ’ లో చేర్చిన 50కి పైగా శాఖలకు 15ు నియంత్రణ విధించింది.  ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మొదటి త్రైమాసికంలో రాబడిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని ఆర్థిక శాఖ వివరించింది. కరోనాను అరికట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శాఖలు, ఇతర ఎమర్జెన్సీ విభాగాలకు ఖర్చులో  నియంత్రణ విఽధించలేదు. వీటిలో ఆరోగ్య శాఖ, ఆయూష్‌ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, గ్రామీణాభివద్ధి, రైల్వే, పౌరవిమానయాన శాఖ, ఫార్మాసూటికల్‌ విభాగంతో పాటు రాష్ట్రాలకు కేంద్ర నిధుల బదిలీ, సుప్రీంకోర్టు, సీవీసీ, యూపీఎస్సీ, రాష్ట్రపతి భవన్‌ ఉన్నాయి.  కేటగిరి  బీ లో  విదేశీ వ్యవహారాలు, హోం, కేబినెట్‌, పోస్టల్‌, ఎరువులు, రోడ్డు రవా ణా, రక్షణ, రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, పెట్రోలియం శాఖలతో పాటు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు, ఉపరాష్ట్రపతి భవన్‌ తదితర శాఖలు, సంస్థలు ఉన్నాయి. కేటగిరీ సీ జాబితాలో వాణిజ్య, టెలికాం, ఐటీ, పర్యావరణ, ఆహార శుద్ధి, పశుసంవర్ధక, తాగునీరు, పారిశుధ్యం, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి శాఖలు ఉన్నాయి. 

Updated Date - 2020-04-10T07:16:27+05:30 IST