Abn logo
Oct 17 2020 @ 01:51AM

కరోనా మందులు పనిచేయట్లేదు!

Kaakateeya

రెమ్‌డెసివిర్‌ సహా 4 ఔషధాలతో ఫలితం శూన్యం: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా, అక్టోబరు 16 : రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, లోపిన్‌అవిర్‌/రిటోన్‌అవిర్‌, ఇంటర్‌ఫెరాన్‌.. ఈ నాలుగు ఔషధాలు తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కరోనా రోగులపై కొంచెం కూడా ప్రభావం చూపలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. రోగులు కోలుకునేందుకు కానీ.. మరణాల రేటును తగ్గించేందుకు కానీ అవి ఉపయోగపడటం లేదని స్పష్టంచేసింది.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాల్లో ఏవైనా కరోనా కట్టడికి దోహదపడతాయా ? అనేది తెలుసుకునేందుకు డబ్ల్యూహెచ్‌వో సమన్వయంతో 30కిపైగా దేశాల్లో గత ఆరు నెలలుగా ‘సాలిడారిటీ థెరప్యూటిక్స్‌’ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 500కు పైగా ఆస్పత్రుల్లో దాదాపు 11,266 మంది కొవిడ్‌ రోగులపై పలు ఔషధాలను పరీక్షిస్తున్నారు. వాటికి సంబంధించిన మధ్యంతర ఫలితాల్లో .. ఆ నాలుగు ఔషధాల పనితీరు అంతంతేనని తేలినట్లు డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం వెల్లడించింది. 

 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement