Abn logo
Jun 22 2021 @ 01:32AM

జిల్లాలో కరోనా తగ్గుముఖం

లాక్‌డౌన్‌, అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు

వారం నుంచి 10లోపే నమోదవుతున్న కేసుల సంఖ్య

థర్డ వేవ్‌ ముప్పుంద ంటున్న వైద్యనిపుణులు

నిర్లక్ష్యం వహిస్తే మూల్యం తప్పదంటూ హెచ్చరికలు

కేసులు తగ్గినా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 21: కొద్దినెలలుగా అందరిని గడగడలాడిస్తు న్న కరోనా వైరస్‌ వ్యాప్తి 15 రోజుల నుంచి తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పాటు, ప్రజలకు అధికార యంత్రాం గం విస్తృతంగా చైతన్యం కల్పించడంతో, ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్‌ శరత్‌ పాజిటివ్‌ కేసుల తగ్గుముఖానికి తగిన సూచనలు చేస్తుండడంతో కొవిడ్‌ తీవ్రత అంత గా లేదని వైద్యులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ విధించకముందు కేసుల తీవ్రత విపరీతంగా ఉండడం, రోజుల వ్యవధిలోనే ప్రజలు మృత్యువా త పడడంతో పాటు వందలలోనే కేసులు వెలుగు లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నిత్యం 10లోపు కేసులకు మించడం లేదని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కేసు లు తగ్గుముఖం పట్టిన ప్రస్తుతం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉండే అవకాశాలు ఉన్నందున ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తు, భౌతికదూరం, శానిటైజర్‌లు, మాస్క్‌లు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలోని 29 ఆసుపత్రుల పరిధిలో నిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు, వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆర్‌టీసీ ఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు పెద్దఎత్తున్న చేపట్టడంతో పాజిటివ్‌ కేసులను త్వరితగతిన గుర్తించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు ప్రతీ ఆరోగ్యకేంద్రంలో నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవేగాక వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా కూడా టెస్టులు చేస్తున్నారు. తద్వారా వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకు మహ మ్మరి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కరోనా ప్రభావం ప్రారంభమైనప్పు డు పట్టణ ప్రాంతాలకే పరిమితమైనా.. సెకండ్‌ వేవ్‌లో గ్రామీణ ప్రాం తాలకు సైతం ఎక్కువగానే వ్యాప్తి చెందిందని, దీంతో అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో పరీక్షల సంఖ్య ఎక్కువ మొత్తంలో నిర్వహించడంతో ప్రజల్లో అవగాహన పెరిగి కరోనా కట్టడికి అవకాశం ఏర్పడింది.

లాక్‌డౌన్‌ అమలుతో సత్ఫలితాలు

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సామాజిక వ్యాప్తికి అడ్డుకట్ట పడిం ది. అలాగే జిల్లా యంత్రాంగం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే, విస్తృత చైతన్య కార్యక్రమాల ఫలితంగా జిల్లా ప్రజలకు కొవిడ్‌పై అవగాహన పెరిగింది. కరోనా కట్టడిలో వైద్యులు, సిబ్బందితో పాటు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సామాన్య ప్రజలు సైతం భాగస్వాములయ్యారు. ఇప్పుడు జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత వారం రోజుల నుంచి వచ్చిన కేసుల సంఖ్యను చూస్తేనే ఇట్టే అర్థమ వుతుంది. కరోనాపై ప్రజల్లో ఎంతమేర చైతన్యం వచ్చిందనేది. జిల్లాలో కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 31 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.  గత వారం రోజులలో జిల్లాలో నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల  16న 7, 17న 7, 18 న 8, 19న 3, 20న 3, సోమవారం కేవలం రెండు కేసులు నమోదయ్యా యి. దీనిబట్టి చూస్తే జిల్లాలో ఎక్కువ మొత్తం పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రజల్లో చైతన్యం వచ్చి స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారని సంబంధత వైద్యధికారులు పేర్కొంటున్నారు.

వర్షాకాలం సీజన్‌తోనే పరేషాన్‌

ప్రస్తుతం వర్షాకాలం కరోనా వైరస్‌ వ్యాప్తికి మరింత దోహదం చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యా ఆరోగ్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం జూలై, ఆగస్టులో కేసుల సంఖ్య పెరిగిన సందర్భాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ప్రజలు గుమిగూడే పరిస్థితులు ఉండ కుండా చూడాలి. ప్రస్తుతం సీజనల్‌ చేంజ్‌తో జలుబు, జ్వరం, దగ్గు ఉండే అవకాశాలు ఉండడం, నిర్లక్ష్యం వహించి కరోనా బారినపడితే ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబు తున్నారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు కరోనా తీవ్రత లేనప్పటికీ మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. స్వీయజాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ  ఽథర్డ్‌ వేవ్‌లో పిల్లలకు కరోనా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు వహించాలని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు కరోనా పట్ల అలసత్వం వహించొద్దు

: చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

గతంతో పోలిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి గత 15 రోజులుగా తగ్గుముఖం పట్టడం సంతోషకరం. కలెక్టర్‌ సూచనలతో జిల్లాలోని 22 మండలాల్లో పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసర మైన చోట మొబైల్‌ వాహనాల ద్వారా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించి పాజి టివ్‌ వచ్చిన వారికి మందులు అందిస్తు హోం ఐసోలేషన్‌లో ఉండాల ని సూచిస్తున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. అయితే కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అలసత్వం వహించడం మానుకోవాలి.