పది లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-03T20:56:15+05:30 IST

7,52,782 యాక్టివ్ కేసుల్లో ఐదు శాతం అంటే 37,752 కేసులు తీవ్ర స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మొత్తం కరోనా కేసుల్లో అమెరికాలోనే నాలుగోవంతు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,45,380

పది లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు పది లక్షలు దాటాయి. అయితే అందులో నాలుగో వంతు కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు అయ్యాయి. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. 10,21,043 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా కరోనా వల్ల ఇప్పటి వరకు 53,458 మంది మరణించారు. 2,14,803 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,52,782 అని, 2,68,261 కేసులు ముగిశాయని గణాంకాలు చెబుతున్నాయి.


7,52,782 యాక్టివ్ కేసుల్లో ఐదు శాతం అంటే 37,752 కేసులు తీవ్ర స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మొత్తం కరోనా కేసుల్లో అమెరికాలోనే నాలుగోవంతు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,45,380 మంది అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. 6,095 మంది మృతి చెందారు. ఇక మృతుల్లో ఇటలీ ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. 13,915 మంది ఇటాలియన్లు మృతి చెందారు. 10,348 మంది స్పెయిన్ దేశస్థులు కరోనా ధాటికి బలయ్యారు. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా కేసులు లక్ష దాటాయి.

Updated Date - 2020-04-03T20:56:15+05:30 IST