విశాఖ జిల్లాలో మరో 676 మందికి కరోనా నిర్ధారణ.. మరో ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2020-08-12T13:25:27+05:30 IST

జిల్లాలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం మరో 676 మంది..

విశాఖ జిల్లాలో మరో 676 మందికి కరోనా నిర్ధారణ.. మరో ఏడుగురి మృతి

కొవిడ్‌ కల్లోలం

జిల్లాలో 21,201కు చేరిన కేసుల సంఖ్య

144కు చేరిన కొవిడ్‌ మరణాలు

జీవీఎంసీ జోన్‌-1 పరిధిలో 67, పెందుర్తిలో 59, పారిశ్రామిక ప్రాంతంలో 38 కేసులు నమోదు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం మరో 676 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 21,201కు చేరింది. కాగా మంగళవారం 1,244 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 14,577 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో 6,480 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా జిల్లాలో మంగళవారం ఏడుగురు మృతిచెందారు. వీటితో కలిపి కొవిడ్‌ మరణాల సంఖ్య 144కు చేరింది.


జీవీఎంసీ జోన్‌-1 పరిధిలో 67.. 

జీవీఎంసీ జోన్‌-1 పరిధిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 307 మందికి పరీక్షలు నిర్వహించగా 67 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒకటో వార్డులో 141 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి, ఐదో వార్డులో 111 మందికి పరీక్షలు నిర్వహించగా 34 మందికి, ఆరో వార్డులో 55 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


పెందుర్తిలో 59.. 

పెందుర్తి పీహెచ్‌సీ పరిధిలో 149 మందికి పరీక్షలు నిర్వహించగా 59 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ బారినపడిన వారిలో పెందుర్తి సీఐ, చినముషిడివాడ లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న నగరానికి చెందిన స్పెషల్‌ బ్రాంచి సీఐ, ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నారు.


పారిశ్రామిక ప్రాంతంలో 38.. 

మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో 38 మందికి కరోనా సోకింది. 45వ వార్డులో ఒకరు, 46వ వార్డులో 19 మంది, 47, 48 వార్డుల్లో 11 మంది, 49వ వార్డులో ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు.


ఆరిలోవలో 23.. 

ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో 150 మందికి పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఆరిలోవ ప్రాంతానికి చెందినవారేనని అధికారులు తెలిపారు. 


మురళీనగర్‌, మాధవధారల్లో 22.. 

మురళీనగర్‌, మాధవధార ప్రాంతాల్లో 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మురళీనగర్‌ ప్రాంతంలో 12 మంది, మాధవధార మహత్‌ కాలనీ, గాంధీనగర్‌, భీమ్‌నగర్‌లో నలుగురు, కళింగనగర్‌ సచివాలయం పరిధిలో ముగ్గురు, తెన్నేటి నగర్‌లో ఇద్దరు, అంబేడ్కర్‌ కాలనీలో ఒకరు చొప్పున మొత్తం 22 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాటిచెట్లపాలెంలో 12

తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో 12 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాటిచెట్లపాలెంతోపాటు వెంకటేశ్వర కాలనీ, శ్రీనివాస నగర్‌లకు చెందిన ఎనిమిది మంది పురుషులు, నలుగురు మహిళలకు పాజిటివ్‌గా తేలింది.  


భీమిలిలో 12..  

భీమిలిలో 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో సుభా్‌షరోడ్డులో నలుగురు, ఎగువపేటకు చెందిన నలుగురు, రెల్లివీధికి చెంది ఇద్దరు, గంటస్తంభం ప్రాంతానికి చెందిన ఒకరు, ఆనందపురం మండలానికి చెందిన మరో వ్యక్తి వైరస్‌ బారినపడ్డారు. 


గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. స్థానిక ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఒకరు, అజంతా పార్క్‌ వద్ద ఒకరు, పాత గోపాలపట్నంలో ఇద్దరు, లక్ష్మీనగర్‌లో ఇద్దరు వైరస్‌ బారినపడ్డారు.

ఆనందపురం మండలం వేములవలసకు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ఎంపీడీవో లవరాజు తెలిపారు. 

పరవాడ మాజీ సర్పంచ్‌ (62) ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు.

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 77 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

సాగర్‌నగర్‌ ఆరోగ్య కేంద్రంలో ఎండాడలోని శిరుగుడి నగర్‌, వివేకానంద నగర్‌ ప్రాంతాలకు చెందిన 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

వేపగుంట ప్రాంతంలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. నాయుడుతోట అప్పలనర్సయ్య కాలనీలో ఇద్దరు, బీసీ కాలనీలో ఒకరు, సింహాచలం డిపో సమీపంలో వృద్ధుడు, భరత్‌ నగర్‌లో ఇద్దరు, పారిశుధ్య కార్మికురాలు వైరస్‌ బారినపడ్డారు.

సబ్బవరం పీహెచ్‌సీలో నిర్వహించిన వైద్య పరీక్షలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో అసకపల్లికి చెందిన ఇద్దరు, నల్లరేగులపాలెం, బాటజంగాలపాలెం, పాతసబ్బవరం, పెందుర్తి ప్రాంతాలకు చెందినవారు ఒక్కొక్కరు, అనకాపల్లికి చెందిన ఇద్దరు ఉన్నారు.


అనకాపల్లిలో 47 కేసులు

అనకాపల్లిలో మంగళవారం 47 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 879కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. గవరపాలెంలో ఓ బాలుడు, తొమ్మిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు, రింగురోడ్డులో ఓ పురుషుడు, భీమునిగుమ్మంలో ఓ పురుషుడు, కోట్ని వీధిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ, నర్సింగరావుపేటలో యువకుడు, తాకాశివీధిలో యువకుడు, విజయరామరాజుపేటలో ఓ మహిళ, గాంధీనగరంలో ఓ పురుషుడు, ఓ మహిళ, అంజయ్య కాలనీలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ, చినరామ క్వార్టర్స్‌లో ఓ బాలుడు, ఓ పురుషుడు, మసీదువీధిలో ఓ పురుషుడు, ఓ మహిళ కొవిడ్‌ బారినపడ్డారు. గొల్లవీధిలో ఓ మహిళ, న్యూ కాలనీలో ఇద్దరు మహిళలు, పెద్దిరాజుపేటలో మహిళ, వుడ్‌పేటలో ఓ మహిళ, చినరాజుపేటలో ఇద్దరు మహిళలు, మిరియాల కాలనీలో ఓ మహిళ, మళ్లవీధిలో ముగ్గురు మహిళలు, రామునాయుడు కాలనీలో ఓ మహిళ, రామకృష్ణ థియేటర్‌ వీధిలో మహిళ, ఏఏంసీ కాలనీలో పురుషుడు, కొప్పాకలో ఓ పురుషుడు, వల్లూరులో మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.


మన్యంలో 40 కేసులు నమోదు 

ఏజెన్సీవ్యాప్తంగా మంగళవారం 132 మందికి పరీక్షలు నిర్వహించగా 40 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. సీలేరులో 20, పాడేరులో 19, హుకుంపేటలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు.


చోడవరంలో 7

చోడవరం పట్టణంలో మంగళవారం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ (43) కరోనా బారినపడ్డారు. పెదబజారువీధికి చెందిన 25 ఏళ్ల యువకుడికి, అంబేడ్కర్‌ కాలనీకి చెందిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పిళ్లావారితోట వీధిలో ఇద్దరు వ్యక్తులు, బోళ్ల వీధిలో 27 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. కో-ఆపరేటివ్‌ కాలనీలో 50 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. 


నర్సీపట్నంలో 3

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురికి వైరస్‌ సోకిందని అధికారులు ప్రకటించారు. ఏఎస్‌పీ కార్యాలయం సమీపంలో పురుషుడు (41), శారదానగర్‌లో ఓ మహిళ, నర్సీపట్నంలో మరో వ్యక్తి(36)కి  పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.


మాడుగులలో 4..విమ్స్‌లో ఎ.కోడూరు మహిళ మృతి

మాడుగుల మండలంలో మంగళవారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని ఎంపీడీవో ఎం.పోలినాయుడు తెలిపారు. మాడుగులలో ఇద్దరికి, కేజేపురంలో ఒకరికి, ఎం.కోటపాడులో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. ఎం.కోడూరు గ్రామానికి చెందిన ఓ మహిళ (55) కరోనాతో విశాఖ విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.

హుకుంపేట మండలంలో మూడు రోజుల్లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. 

జి.మాడుగులలో మంగళవారం ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 

దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన 38 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి ఎస్‌.లలిత తెలిపారు.  

- పాయకరావుపేట బృందావనంలో మహిళ (54)కి పాజిటివ్‌ వచ్చిందని పీహెచ్‌సీ అధికారులు తెలిపారు.  

- రాజుపేటలో ఆర్మీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు మాకవరపాలెం పీహెచ్‌సీ డాక్టర్‌ శ్రీవిద్య తెలిపారు.  


Updated Date - 2020-08-12T13:25:27+05:30 IST