నర్సీపట్నంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే ఏకంగా..

ABN , First Publish Date - 2020-08-22T18:08:47+05:30 IST

నర్సీపట్నం మునిసిపాలిటీలో శుక్రవారం రికార్డు స్థాయిలో 56 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో పోలీసులు, ప్రాంతీయ ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు.

నర్సీపట్నంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే ఏకంగా..

రికార్డు స్థాయిలో ఒకేరోజు 56 మందికి పాజిటివ్‌

బాధితుల్లో పలువురు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌


నర్సీపట్నం టౌన్‌: నర్సీపట్నం మునిసిపాలిటీలో శుక్రవారం రికార్డు స్థాయిలో 56 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో పోలీసులు, ప్రాంతీయ ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు. వీరితో కలిపి పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య 275కి చేరింది. తాజాగా శారదా నగర్‌లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక యువతి, సీబీఎం కాంపౌండ్‌లో మహిళ, గచ్చపు వీధిలో పురుషుడు, కొత్తవీధిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు,అయ్యన్నపాలెంలో బాలుడు,బాలిక, ముగ్గురు పురుషులు, పెదబొడ్డేపల్లిలో ఇద్దరు వృద్ధులు, పాత పోలీస్‌ క్వార్టర్స్‌లో పురుషుడు, ప్రాంతీయ ఆస్పత్రిలో ఓ మహిళా ఉద్యోగి, ఓ వైద్యుడు, పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఐదుగురు సిబ్బంది, ఓఎస్‌డీ కార్యాలయం ఉద్యోగికి కరోనా సోకింది.


అలాగే కాపువీధిలో బాలిక, పురుషుడు, మహిళ, పాత బస్టాండ్‌ ప్రాంతంలో పురుషుడు, ఆరో వార్డులో పురుషుడు, వెంకునాయుడుపేటలో ఇద్దరు పురుషులు, రామారావుపేటలో పురుషుడు, ప్రశాంతినగర్‌లో వృద్ధుడు, శివపురంలో పురుషుడు, వెలమవీధిలో యువతి, వై.జంక్షన్‌లో మహిళ, మసీదు వీధిలో పురుషుడు, ఇద్దరు యువతులు, వృద్ధుడు, బలిఘట్టంలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, లక్ష్మీపురంలో మహిళ, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఇద్దరు పురుషులు, బాలిక, ఇద్దరు మహిళలు, మండలంలోని గురందొరపాలెంలో ఓ యువకుడు కరోనా బారినపడ్డారు.

Updated Date - 2020-08-22T18:08:47+05:30 IST