హలో.. వ్యాక్సిన్‌ వేస్తున్నారా..

ABN , First Publish Date - 2021-04-17T05:24:02+05:30 IST

ఓ వైపు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి.. మరోవైపు వ్యాక్సిన్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహన.. వెరసి వ్యాక్సినేషన్‌కు జనం క్యూ కడు తున్నారు.

హలో.. వ్యాక్సిన్‌ వేస్తున్నారా..

ఆసుపత్రుల వద్ద జనం క్యూ

వ్యాక్సిన్‌ లేక నిరాశగా వెనక్కి 

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 16: ఓ వైపు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి.. మరోవైపు వ్యాక్సిన్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహన.. వెరసి వ్యాక్సినేషన్‌కు జనం క్యూ కడు తున్నారు. వ్యాక్సిన్‌ కొరతతో.. అది ఎక్కడ ఉందంటే.. అక్కడకు వెళుతున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ తమ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని వ్యాక్సిన్‌ కేంద్రానికి వందలాది మంది వచ్చి వ్యాక్సిన్‌ కోసం పడిగాపులు పడి, లేదని తెలియడంతో వెళ్లిపోతున్నా రు. ఎప్పుడు వస్తుందో తెలియదని.. మేం చెప్పలేమని అక్కడ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ కోసం వృద్ధులు సైతం మండుటెండలో ఆసుపత్రికి దూరప్రాంతాల నుంచి వచ్చి నిస్సహాయ స్థితిలో వెళ్లిపోతున్నారు. ఇదే పరిస్థితి కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు, ఉండి, జీలుగుమిల్లి తదితర మండలాల్లో పీహెచ్‌సీలకు వచ్చిన వారు వ్యాక్సిన్‌ లేకపోవ డంతో నిరాశగా వెనుదిరిగారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

నేడు టీకా నిల్వలు అవకాశం !

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 16 : కొవిడ్‌ టీకా మందును జిల్లాలో ఐదు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో 270 మంది లబ్ధిదారులకు శుక్రవారం వేశారు. జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ప్రభుత్వాసు పత్రులు, గ్రామ/వార్డు సచివాలయలకు శుక్రవారం లబ్ధిదారులు అధిక సంఖ్యలో తరలి వచ్చినప్పటికీ వ్యాక్సిన్‌ కొరత వల్ల వెనుదిరిగారు. కొత్తగా టీకా మందు నిల్వలు శనివారం జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు జిల్లావ్యాప్తంగా సీవీసీలకు వ్యాక్సిన్‌ రవాణా చేసేందుకు టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2021-04-17T05:24:02+05:30 IST