Abn logo
Mar 27 2020 @ 00:26AM

పుచ్చ రైతుకు కరోనా దెబ్బ!

ఆగిన ఎగుమతులు


కోట, మార్చి 26 : అధిక దిగుబడులు సాధించినా, కరోనా కారణంగా పుచ్చకాయలను అడిగే నాథుడు లేకపోవడం, ఎగుమతి చేసుకునేందుకు సైతం అవకాశం లేకపోవడంతో రైతులు కాయలను పొలాల్లోనే వదిలేసుకుంటున్నారు. కోట మండలం గూడలి, గూడలి రాజుపాళెం, చిట్టేడు, మద్దాలి, కేశవరం, కొండుగుంట తదితర గ్రామాల్లోని  రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల  వరకు పెట్టుబడి పెట్టి పుచ్చ పైరు సాగు చేశారు.  ఆశించిన స్థాయిలో కాయలు కాయడంతో  రెండింతలు లాభం వస్తుందని ఆశించారు.  కరోనా ప్రభావంతో ఎగుమతులు ఆగిపోవడంతో, కాయలు అడిగే నాథులు లేకుండా పోయారు. దీంతో కాయలను పొలాల్లోనే వదిలేశారు


అధైర్య పడొద్దు..

పుచ్చ రైతులు అధైర్యపడొడ్డు. కరోనా ప్రభావం నుంచి బయట పడతాం. పుచ్చ కాయలకు మంచి ధరలు వస్తాయనే ఆశిస్తున్నాం. ఈ లోపల రైతులు ఎలాంటి అపోహలకు లోను కావద్దు. 

-  నిరంజన్‌ కుమార్‌, వ్యవసాయాధికారి

Advertisement
Advertisement
Advertisement