‘తుమ్మండి’ అన్న ఇన్ఫోసిస్‌ ఉద్యోగి తొలగింపు

ABN , First Publish Date - 2020-03-29T08:26:08+05:30 IST

‘‘ఆరు బయట తుమ్మండి. కరోనాను వ్యాపింపజేయండి’’ అంటూ సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చిన ఒకరిని ఇన్ఫోసిస్‌ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

‘తుమ్మండి’ అన్న ఇన్ఫోసిస్‌ ఉద్యోగి తొలగింపు

బెంగళూరు, మార్చి 28: ‘‘ఆరు బయట తుమ్మండి. కరోనాను వ్యాపింపజేయండి’’ అంటూ సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చిన ఒకరిని ఇన్ఫోసిస్‌ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ముజీబ్‌ మహమ్మద్‌ అనే ఉద్యోగి ఫేస్‌బుక్‌లో ఈ మేరకు పోస్ట్‌ చేశాడు. సంస్థ మొదట అది ఫేక్‌ ఐడీగా భావించింది. కానీ తర్వాత విచారణలో తమ ఉద్యోగే అని తెలియడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ముజీబ్‌ సంస్థ నియమనిబంధనలను ఉల్లంఘించాడని పేర్కొంది.

Updated Date - 2020-03-29T08:26:08+05:30 IST