Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల్లో ఏకకాలంలో కరోనా, యాంటీబాడీలు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 3: చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగానే ఉన్నా వారి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. పిల్లల్లో వైరస్‌, యాండీ బాడీలు ఏకకాలంలో ఉన్నాయని ఆ అధ్యయనంలో తేలింది. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధన జర్నల్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌లో ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా 6,369 మంది పిల్లలకు కొవిడ్‌ పరీక్షలు చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 215 మంది పిల్లలకు యాంటీబాడీ పరీక్షలు చేశారు. వీరిలో 33 మంది రోగులకు యాంటీబాడీలతో పాటు కొవిడ్‌ పరీక్ష కూడా చేశారు. ఈ 33 మంది పిల్లల్లో 9 మందిలో రెండింటినీ గుర్తించారు. తర్వాత కూడా వీరికి పరీక్ష చేయగా వైరస్‌ పాజిటివ్‌ రావడం గమనార్హం.


Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement