విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-08-02T10:49:08+05:30 IST

విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా

జిల్లాలో భారీగా పెరుగుతున్న  కేసులు

ఇప్పటి వరకు 1,210 నమోదు

పెరిగిన కేసులతో జనం పరేషాన్‌

జనరల్‌ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు 


నిజామాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కరోనా జనాన్ని పరేషాన్‌ చేస్తోంది. జిల్లాలో ఊహించ ని రీతిలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. జూలై నెలలో కేసుల సంఖ్య మరీ ఎక్కువ అయ్యా యి. ఈ తీవ్రత సాధారణ జ్వరం వచ్చిన వారిని కూడా ఉలిక్కిపడేలా పరిస్థితులను కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ జనం నుంచి ఉద్యోగుల వరకు, రాజకీయ పార్టీల నే తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కరోనా బారిన పడుతున్నారు. లక్షలా ది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు. 


ప్రతీరోజు పెద్ద సంఖ్యలో.. 

జిల్లాలో టెస్టుల సంఖ్యను పెంచిన ప్రతిరోజూ పెద్దసంఖ్యలో రాపిడ్‌ టెస్టుల కోసం పరీక్ష కేంద్రాలకు వస్తున్నారు. తప్పనిసరి కావడంతో పరీ క్షలు చేసుకుంటున్నారు. జిల్లాలో నాలుగున్నర నెలలుగా కరోనా ప్రభావం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత ఈ తీవ్రత మరిం త పెరిగింది. 


జిల్లాలో ఇప్పటి వరకు 3815 మందికి పరీక్షలు..

జిల్లాలో తొలి కేసు మార్చి 24న మర్కజ్‌ వెళ్లివచ్చిన వారి ద్వారా నమోదైంది. ఇప్పటి వరకు 3815 మందికి పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలలో ఇప్పటివరకు 1210 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు ఎక్కువ తీవ్రత లేనివారు హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సలహాలతో  చికిత్స పొందుతున్నారు. జిల్లాలో లాక్‌డౌన్‌ సమయంలో కట్టడి జోన్లను ఏర్పా టు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేయ డంతో వైరస్‌ తీవ్రత తగ్గింది. ఏప్రి ల్‌, మే నెలల్లో కేసులు అంతగా లేవు. లాక్‌డౌన్‌ సడలింపులు ఎత్తివే సి రవాణాకు అనుమతి ఇచ్చిన త ర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం పెరుగడం హైదరాబాద్‌, మహా రాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడం పెరుగడంతో కేసుల సం ఖ్య భారీగా పెరిగింది. జూలైలో ఊహించని విధంగా కేసుల సంఖ్య నమో దు అయ్యింది. నగరం పరిధిలో భారీగా కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకూ తీవ్రత మరింత పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు కొన్ని స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని మండలాల పరిధిలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. జిల్లాలో ఎక్కువగా పనులు, కార్యక్రమాలలో పాల్గొనేవారే ఎక్కవగా ఈ కేసుల బారిన పడుతున్నారు. రాజకీయ పార్టీ నేతలే ఎక్కు వగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు ఎక్కువగా కార్యక్రమాలు, ఎక్కువ మందిని కలువడంతో వారికి సోకుతుంది. 


హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స.. 

జిల్లాలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా ఉంటే ఇంటి వద్దే హోంక్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, బ్యాంకు, ఇతర శాఖల ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడ్డా రు. వీరిలో మండలస్థాయి నుంచి జిలా ్లస్థాయి వరకు ఉన్నారు. ప్రజలు అవసరం లేకున్నా ఎక్కువగా బయటకు వస్తుండడంతో కేసులు మరింత పెరిగాయి. నగ ర పరిధిలో కొ న్ని కుటుంబాల వా రు ఎక్కువ గా కరోనా బారి నపడ్డారు. జిల్లా లో వైరస్‌ ఎక్కు వగా రావడానికి జాగ్రత్తలు పా టించక పోవడ మేనని వైద్యులు తెలుపుతున్నారు. ఇంటినుంచి బయటికి వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి రాదని వారు అంటున్నారు. 


జనరల్‌ ఆసుపత్రిలో భారీగా చేరిక..

జిల్లాలో కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. దీంతో జనరల్‌ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఐసోలేషన్‌తో పాటు ఐసీ యూలో 180 వరకు చికిత్స పొందుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుం డడంతో ఆసుపత్రిలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నారు. ఆసుప త్రితో కొత్త వెంటిలేటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఐసోలేషన్‌తో ఐసీయూ బెడ్స్‌కు సెంట్రల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ఆక్సిజన్‌ వ్య వస్థను సిద్ధం చేశారు. మొత్తం 210 బెడ్స్‌కు అందే విధంగా ఏర్పాట్లను చేశారు. ఆసుపత్రిలో వీటికి ఇబ్బందులు వస్తే సాధారణ 110 సిలిండర్‌ల ను అందుబాటులో ఉంచారు. ఆసుపత్రిలో చేరిన వారికి ఇబ్బందులు లే కుండా వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సూపరింటెంటెండెంట్‌ డాక్టర్‌ బాల్‌రాజ్‌ తెలిపారు. పాజిటివ్‌ ఉన్నవారు కోలుకునే విధంగా అన్ని మందులు అందిస్తున్నామన్నారు. ఎక్కువ మంది సీరియస్‌గా అయిన తర్వాత వస్తున్నారని, అందువల్లనే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయ ని అన్నారు. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Updated Date - 2020-08-02T10:49:08+05:30 IST