ఉమ్మడి జిల్లాలో 464 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-05T09:52:54+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 464 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 269 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో 11 నమోదయ్యాయి

ఉమ్మడి జిల్లాలో 464 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ఉమ్మడి  రంగారెడ్డి జిల్లాలో బుధవారం 464 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 269 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో 11 నమోదయ్యాయి. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 184 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు మూడు జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య 97,787కు చేరుకుంది. 


ఇబ్రహీంపట్నంలో 15మందికి..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో మంగళవారం 10 కేంద్రాల్లో 234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 15మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో అబ్దుల్లాపూర్‌మెట్‌లో నలుగురికి, యాచారంలో ముగ్గురికి, ఇబ్రహీం పట్నంలో ఒకరికి, ఎలిమినేడులో ఇద్దరికి, హయత్‌నగర్‌ కమ్యూనిటీహెల్త్‌సెంటర్‌ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


శంషాబాద్‌లో ఒకరికి..

శంషాబాద్‌: శంషాబాద్‌లో బుధవారం ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మొత్తం 30 మందికి పరీక్షలు నిర్వహించినట్టు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు. 


మేడ్చల్‌ పీహెచ్‌సీలో ముగ్గురికి..

మేడ్చల్‌: మేడ్చల్‌ పీహెచ్‌సీలో 59 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా  ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. శ్రీరంగవరం పీహెచ్‌సీలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో ఐదుగురికి..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో బుధవారం 224 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ముగ్గురు, నందిగామ మండలానికి చెందిన ఒకరు, కొందుర్గు మండలానికి చెందిన ఒకరు ఉన్నారు. 


చేవెళ్ల డివిజన్‌లో ఎనిమిది మందికి..

చేవెళ్ల: చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 166మందికి కరోనా పరీక్షలు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కరోనా సోకిన వారిలో శంకర్‌పల్లి మండలంలో ఐదుగురు, మొయినాబాద్‌ మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు.


ఆమనగల్లులో నాలుగు..

ఆమనగల్లు: ఆమనగల్లు, కడ్తాల్‌, వెల్దండ మండలాల పరిధిలోని 43 మందికి బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.


వికారాబాద్‌ జిల్లాలో 11 కరోనా కేసులు

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో బుధవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 5, కొడంగల్‌లో 5, పెద్దేముల్‌లో ఒక పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కొత్తగా నమోదైన కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 2575కు చేరుకోగా, 224 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు జిల్ల్లాలో కరోనాతో 49మంది మృతి చెందారు. 2,302 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2020-11-05T09:52:54+05:30 IST