Abn logo
Apr 21 2021 @ 08:08AM

కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, డాక్టర్‌ మంజుల తదితరులు

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదేశాలు


గుంటూరు: కరోనా కట్టడిలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారినపడ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదేశిం చారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పోలీసు అధికారు లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ అర్బన్‌లో ఇప్పటి వరకు 37 మంది కరోనా బారినపడ్డారన్నారు. చికిత్స పొందుతున్న పోలీసులపై ప్రత్యేక దృష్టిసారించి ఎప్పటికప్పుడు వారికి అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితి తెలు సుకుంటున్నామన్నారు. కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని తెలి పారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ 98 శాతం తీసుకున్నారని, రెండో డోసు కూడా త్వరి తగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కరోనా బారినపడిన వారిని పర్యవేక్షిం చేందుకు ప్రత్యేకంగా అధికారులను కేటాయించామన్నారు. 24 గంటలు పని చేసే విధంగా ఫ్యామిలీ హెల్త్‌ డెస్కు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సహాయం కావాల్సిన వారు 86888 31573 నెంబరుకు ఫోను చేసి సహాయం పొందవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్‌ మంజుల, అదనపు ఎస్పీ గంగాధరం, మనోహరరావు, డీఎస్పీలు బాలసుందరరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement