కార్పొరేటర్‌ భర్త కరోనాతో కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-11T06:44:22+05:30 IST

బీజేపీ నాయకుడు, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సి. సునీతాగౌడ్‌ భర్త సి. ప్రకా్‌షగౌడ్‌ (53) కరోనాతో శనివారం కన్నుమూశారు.

కార్పొరేటర్‌ భర్త కరోనాతో కన్నుమూత
సి.ప్రకా్‌షగౌడ్‌ (ఫైల్‌)

రాంనగర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నాయకుడు, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సి. సునీతాగౌడ్‌ భర్త సి. ప్రకా్‌షగౌడ్‌ (53) కరోనాతో శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య సునీతాగౌడ్‌, కుమారుడు తరుణ్‌గౌడ్‌, కుమార్తె వైష్ణవి ఉన్నారు. ప్రకా్‌షగౌడ్‌కు ఆస్తమా సమస్య ఉంది. ఈ నెల 7న రాంనగర్‌ మీ సేవ కార్యాలయంలో తన సతీమణి కోసం కార్పొరేటర్‌ వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌లతో దానిని ప్రారంభించారు. మరుసటి రోజు 8న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి శుక్రవారం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చేరారు. అక్కడ కొవిడ్‌ పరీక్షలు చేయగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అంతకుముందే ఆస్తమా సమస్య ఉండటంతో శ్వాస ఇబ్బంది మరింత తీవ్రమైంది. దీంతో ప్రకా్‌షగౌడ్‌ శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కరోనా మైల్డ్‌గా వచ్చిందని, ఆస్తమా ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయిందని వైద్యులు చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని  రాంనగర్‌లోని వారి సొంత ఇంటికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో పార్సిగుట్టలోని గౌడ సంఘం శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలియగానే ఆయన కుమారుడు తరుణ్‌గౌడ్‌ కుప్పకూలిపోయారు. భార్య, ఇతర బంధువు లు ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడు ప్రకా్‌షగౌడ్‌ మృతిని తట్టుకోలేక ఆయన తల్లి లతితాబాయ్‌ కన్నీరుమున్నీరయ్యారు. ‘నా కళ్లముందే వెళ్లి పోయావా’ అంటూ రోధించారు. భర్త మరణంతో కార్పొరేటర్‌ సునీతాగౌడ్‌ ఏడుస్తూ పడిపోయారు. 

వ్యాక్సిన్‌ సెంటర్‌కు కరెంట్‌ కట్‌ 


బోయినపల్లి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): బోయినపల్లిలోని ప్రభుత్వ కరోనా టీకా సెంటర్‌ కరెంట్‌ బిల్‌ కట్టలేదని అధికారులు సరఫరా నిలిపివేశారు. దీంతో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు 3 గంటలపాటు కరెంట్‌ లేకపోవడంతో  జనం చెట్లకింద కూర్చుని ఎదురుచూశారు. సహనం కోల్పోయి వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకుడు జంపన ప్రతాప్‌, కపిల్‌, శంకర్‌ వచ్చి పరిశీలించారు. జంపన ప్రతాప్‌ సొంత నిధులతో బిల్‌ చెల్లించి, సరఫరా పునరుద్ధరించారు.  



Updated Date - 2021-04-11T06:44:22+05:30 IST