Abn logo
Sep 16 2020 @ 04:24AM

శ్రీశైలంలో రాగిరేకులు, వెండి నాణేలు లభ్యం

శ్రీశైలం(కర్నూలు కల్చరల్‌). సెప్టెంబరు 15: శ్రీశైలంలోని ఘంటామఠ పునర్నిర్మాణ పనుల్లో మంగళవారం రాగిరేకులు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. ప్రాచీణ కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచ మఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ఈ పనులు చేస్తుండగా గతంలో కొన్ని రాగిరేకులు లభ్యమయ్యాయి. మంగళవారం కూడా 9 రాగిరేకులు, 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం లభించాయి. రాగిరేకులపై నాగరి, కన్నడ లిపి చెక్కి ఉన్నట్లు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు.


ఒక రాగిరేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉంది. రేకులపై శివలింగంతోపాటూ నంది, గోవు కూడా చిత్రీకరించి ఉన్నాయి. వెండి నాణేలు 1800-1910 నాటివిగా గుర్తించినట్లు ఈవో తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ బి. రాజేంద్రసింగ్‌, పోలీసులు, దేవస్థానం ఇంజినీరింగ్‌, భద్రత అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేసినట్లు ఈవో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement