భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులు

ABN , First Publish Date - 2022-01-15T05:49:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్‌సీని 32 పేజీల నివేదికను శుక్రవారం ఉపాధ్యాయులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులు
పీఆర్‌సీ నివేదికలు దహనం చేస్తున్న ఎస్టీయూ నాయకులు

నంబులపూలకుంట, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్‌సీని 32 పేజీల నివేదికను శుక్రవారం ఉపాధ్యాయులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ కార్యాలయంలో ఎస్‌టీయూ ఆధ్వర్యంలో పీఆర్‌సీ ప్రకటనపై నిరసన కార్య క్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ హరిప్ర సాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 23.29 శాతం ఫిట్‌మెంట్‌ను తిరస్క రిస్తూ ప్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అశుతోష్‌ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల అభిప్రాయాలు సేకరించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి  ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఆ కమిటీ నివేదికలు బహి ర్గతం చేయకుండా సీఎస్‌ నేతృత్వంలో కమిటీ వేసి ఆగమేఘాలపై పీఆర్‌సీ ఫిట్‌ మెంట్‌ ప్రకటించడంతో నష్టపోయామన్నారు. ఇప్పటి వరకు 10 పీఆర్‌సీలు ప్రకటించి, గతంలో ఎప్పుడూ ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖ లాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి, ఆమోదయోగ్యమైన పీఆర్‌సీని ప్రకటించాలన్నారు. ఈ నెల 20 వ తేదిన జిల్లా కార్యాలయం ముట్టడి, 26న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ మండల అధ్యక్షుడు రామాంజులు, ప్రధాన కార్యదర్శి వీర మహేశ్వర్‌, సీపీఎస్‌ కన్వీనర్‌ గంగాధర్‌యాదవ్‌, బాబ్‌జాన్‌, ఖాసీంవలి, ఎంఎన్‌ ప్రసాద్‌, వెంకటరమణ, యోగేంద్ర, ఎం ఆర్‌సీ సిబ్బంది ఈశ్వరరెడ్డి, బషీర్‌, శంకర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-15T05:49:47+05:30 IST