శీతల పానీయాలతో అనారోగ్యం

ABN , First Publish Date - 2022-04-17T16:17:01+05:30 IST

తిరువణ్ణామలై ఆలయానికి వచ్చిన విదేశీ మహిళ రాష్ట్ర సంప్రదాయ, సహజసిద్ధ పానీయం మజ్జిగ విక్రయిస్తోంది. చిత్తిరై పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన భక్తులకు గిరి ప్రదక్షిణ మార్గంలో

శీతల పానీయాలతో అనారోగ్యం

                           - మజ్జిగ విక్రయిస్తూ విదేశీ మహిళా అవగాహన ప్రచారం


పెరంబూర్‌(చెన్నై): తిరువణ్ణామలై ఆలయానికి వచ్చిన విదేశీ మహిళ రాష్ట్ర సంప్రదాయ, సహజసిద్ధ పానీయం మజ్జిగ విక్రయిస్తోంది. చిత్తిరై పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన భక్తులకు గిరి ప్రదక్షిణ మార్గంలో కుండల్లో ఉంచిన మజ్జిగను గ్లాసు రూ.10కి విక్రయిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, వేసవికాలంలో మజ్జిగ శరీరానికి ఎంతో మంచిదన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎండ వేడిమి నుంచి సేదతీరేందుకు శీతలపానీయాలు తాగుతూ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. సంప్రదాయ, సహజసిద్ధ మజ్జిగలోని పోషలవిలువలను ప్రజలకు తెలియచెప్పేలా ఈ అవగాహన ప్రచారం చేపట్టినట్లు ఆ విదేశీ మహిళ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-17T16:17:01+05:30 IST