దివ్యాంగ పింఛన్‌గా మార్చండయ్యా..!

ABN , First Publish Date - 2022-08-19T05:46:59+05:30 IST

‘వృద్ధాప్య ఫింఛన్‌ వస్తుంది.. దివ్యాంగ ఫింఛన్‌గా మార్చమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఏదో విధంగా పనిచేయించి పెట్టండయ్యా’ అని అద్దంకి పట్టణంలోని 8వ వార్డుకు చెందిన మీసాల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రవికుమార్‌ ఎదుట మొరపెట్టుకున్నారు.

దివ్యాంగ పింఛన్‌గా మార్చండయ్యా..!
దివ్యాంగుడుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

అధికారుల చుట్టూ  తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు

ఎమ్మెల్యే రవికుమార్‌ను వేడుకున్న  బాధితుడు

అద్దంకి, ఆగస్టు 18: ‘వృద్ధాప్య ఫింఛన్‌ వస్తుంది.. దివ్యాంగ ఫింఛన్‌గా మార్చమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఏదో విధంగా పనిచేయించి పెట్టండయ్యా’ అని అద్దంకి పట్టణంలోని 8వ వార్డుకు చెందిన  మీసాల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రవికుమార్‌ ఎదుట మొరపెట్టుకున్నారు.  దీంతో వెం టనే ఎమ్మెల్యే రవికుమార్‌ అధికారులకు ఫోన్‌చేసి మాట్లాడారు. రామకృష్ణాపురం ఎస్టీ కాలనీకి చెందిన ఇండ్ల మాణిక్యాలరావు గుండె  సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఎమ్మెల్యే పరామర్శించారు. రేషన్‌ కార్డులో భార్య, పిల్లల పేర్లు ఉండగా మాణిక్యాలరావు పేరు లేకపోవటంతో గుండె శస్త్రచికిత్స  ఆలస్యమవు తుందని ఎమ్మెల్యే రవికుమార్‌ దృష్టికి తీసుకురాగా తహసీల్దార్‌ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడా రు. రేషన్‌కార్డులో పేరు నమోదు చేయాలని, ఆలస్య మయ్యే పరిస్థితిలో వైద్య పరీక్షలకు ఉపయోగపడే విధంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని తెలిపారు. 

8వ వార్డులో పక్షవాతంతో బాధపడుతున్న జుజ్జూరి శ్రీనివాసరావు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నర్రావా రిపాలెంకు చెందిన ఎరకసాని లక్ష్మీరెడ్డి, గాయపడి మోకాలి  శస్త్ర చికిత్స చేయించుకున్న శేషారావు, ఆవు పొడవడంతో  గా యపడ్డ గోనుగుంట్ల  సుబ్బారావును ఎమ్మెల్యే రవికుమార్‌ పరామర్శించా రు. నర్రావారిపాలెంకు చెందిన నర్రా కోటయ్య,   వాసవినగర్‌లో  ధూళిపా ళ్ళ నాగవెంకట రమణ దశదిన కర్మల కు హాజరై నివా ళులర్పించారు. 

పట్టణంలోని 16వ వార్డ్లులో ముం డ్లమూరు మండలం వేంపాడు పాఠ శాలలో హెచ్‌ఎంగా పనిచేస్తూ ఇటీవ ల గుండెపోటుతో మృతి చెందిన యో గేశ్వరరావు, 8వ వార్డులో ఇటీవల మృ తిచెందిన గోళ్ళ వీరరాఘవు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండలంలోని తిమ్మా యపాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న పొదిలి నాగేశ్వరరావును ఎమ్మెల్యే రవికుమార్‌ పరామర్శిం చారు. కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు కరి పరమేష్‌, చిన్ని శ్రీనివాస రావు, కుందారపు రామారావు, కాకాని అశోక్‌, వడ్డపల్లి పూర్ణ, కోనేటి అనిల్‌, దొప్పలపూడి ప్రసాద్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:46:59+05:30 IST