బిహార్‌ వివాదాస్పద మంత్రి సుధాకర్‌ రాజీనామా

ABN , First Publish Date - 2022-10-03T09:15:40+05:30 IST

తన శాఖలోని దొంగల ముఠాకు నాయకుని(సర్దార్‌)గా మారానని, తనపైన కూడా సర్దార్‌లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన బిహార్‌ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ రాజీనామా చేశారు.

బిహార్‌ వివాదాస్పద మంత్రి సుధాకర్‌ రాజీనామా

పట్నా, అక్టోబరు 2 : తన శాఖలోని దొంగల ముఠాకు నాయకుని(సర్దార్‌)గా మారానని, తనపైన కూడా సర్దార్‌లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన బిహార్‌ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. సుఽధాకర్‌ తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారని అతని తండ్రి, బిహార్‌ ఆర్జేడీ అథ్యక్షుడు జగదానంద్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు. ఆర్జేడీ తరఫున రామఘడ్‌ నుంచి శాసనసభకు ఎన్నికైన సుధాకర్‌ సింగ్‌ కేబినెట్‌లో ఉన్నప్పటికీ నితీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని సర్కారుపై అనేక విమర్శలు చేశారు.  

Updated Date - 2022-10-03T09:15:40+05:30 IST