‘క్రిప్టో’లపై నియంత్రణే!

ABN , First Publish Date - 2021-12-03T08:06:41+05:30 IST

బిట్‌కాయిన్‌వంటి క్రిప్టో కరెన్సీలను నిషేధించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. నిషేధానికి బదులు వీటిని నియంత్రిస్తేచాలని భావిస్తోంది.

‘క్రిప్టో’లపై నియంత్రణే!

  • నిషేధంపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం 
  • సెబీ చేతికి నియంత్రణాధికారం

న్యూఢిల్లీ, డిసెంబరు 2: బిట్‌కాయిన్‌వంటి క్రిప్టో కరెన్సీలను నిషేధించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. నిషేధానికి బదులు వీటిని నియంత్రిస్తేచాలని భావిస్తోంది. ప్రతిపాదితక్రిప్టోకరెన్సీ బిల్లులో ఇదే విషయాన్ని ప్రతిపాదించింది. కేంద్ర కేబినెట్‌ ముందుంచిన నోట్‌లోనూ ఈ విషయం పేర్కొంది. వివిధవర్గాల నుంచి వచ్చిన సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ప్రతిపాదిత బిల్లులో క్రిప్టో కరెన్సీలను కరెన్సీలుగాకాకుండా క్రిప్టో ఆస్తులుగా పేర్కొన్నారు. తద్వారా వీటి లావాదేవీలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న క్రిప్టో ఆస్తుల వెల్లడికి త్వరలో ఒక నిర్ణీత తేదీని ఖరారు చేయనున్నారు. క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తేలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదు. దీంతో వాటి లావాదేవీలపై వచ్చే లాభాలూ పన్నుల పరిధిలోకి రావు. తాజా బిల్లు ద్వారా ప్రభు త్వం క్రిప్టోలను కూడా ఆస్తులుగా గుర్తించి నియంత్రించబోతోంది. దాంతో వాటిపై వచ్చే లాభాలూ ఇతర పెట్టుబడుల మాదిరిగా మూలధన లాభాల పరిధిలోకి వ స్తాయి. ముఖ్యంగా క్రిప్టోల రూపంలో ఉగ్రవాద మూకలకు అందే బ్లాక్‌మనీకి ఈ నియంత్రణ ద్వారా తెరపడుతుందని భావిస్తున్నారు. కాగా కేబినెట్‌ ఆమోదం పొం ది ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపజేసుకోవాలని సర్కారు భావిస్తోంది. 

Updated Date - 2021-12-03T08:06:41+05:30 IST