నియంత్రణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-04-10T05:57:21+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభు త్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యల పై శుక్రవారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడీయో కాన్ఫరెన్స్‌లో సీపీ కార్తీకేయతో పాటు అదనపు డీసీపీలు పాల్గొన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ నివారణకు

నియంత్రణ చర్యలు చేపట్టాలి

ఖిల్లా, ఏప్రిల్‌ 9: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభు త్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యల పై శుక్రవారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడీయో కాన్ఫరెన్స్‌లో సీపీ కార్తీకేయతో పాటు అదనపు డీసీపీలు పాల్గొన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ నివారణకు గాను ప్రతీఒక్కరు మాస్కు ధరించడం, తదితర అంశాల పై ప్రజలకు అవగాహన కలిగించాలని డీజీపీ సూచించా రు. బయటకు వచ్చేవారు మాస్కు ధరించడంలో అలస త్వం వహిస్తే ప్రమాదం కొనితెచ్చుకోవడమేననే సందేశా న్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జరిగే నష్టాన్ని వివరించాలన్నారు.  ఇందులో అదనపు డీసీపీలు అర్వింద్‌బాబు, ఉషావిశ్వనాథ్‌, భాస్కర్‌, నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-10T05:57:21+05:30 IST