మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-04-19T05:57:02+05:30 IST

మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు.

మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి
మునిసిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర్‌రావు

 విద్యుత అధికారుల తీరుపై మునిసిపల్‌ కౌన్సిల్‌లో రగడ

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 18: మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి  సహకరించాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. సోమవారం చైర్మన భార్గవ్‌ అధ్యక్షతన జరిగిన మునిసిపల్‌ సమావేశం జరిగింది. వి ద్యుత అధికారుల తీరుపై రగడ జరిగింది. మే నెలలో పట్టణ ప్రగ తి కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో విద్యుత అధికారులు అన్ని వార్డులు స్వయంగా పరిశీలించి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కౌన్సిలర్లు వార్డుల్లో ప్రజా సమస్యలపై దృ ష్టి సారించాలన్నారు. విద్యుత అధికారులు కౌన్సిల్‌లో లేవనెత్తిన స మస్యలను వినడమే తప్ప పరిష్కరించడం లేదన్నారు. తరచుగా క రెంటు కోతలు పెడుతున్నారని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆరోపించారు. స మావేశంలో మునిసిపల్‌ వైస్‌చైర్మన కోటేశ్వరరావు, మునిసిపల్‌ క మిషనర్‌ రవీందర్‌సాగర్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.  వి ద్యుత అధికారుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కా ర్యాలయం ఎదుట ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అ ధికారులు సమావేశంలో చెప్పిన సమస్యలను రాసుకొని బయటకు వెళ్లి మరిచిపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, జయలక్ష్మి, జలందర్‌రెడ్డి, స క్కుబాయమ్మ, రామకృష్ణ, జాని, నాగలక్ష్మి, రుణాల్‌రెడ్డి, అనిత, వెం కటమ్మ తదితరులు పాల్గొన్నారు. 







Updated Date - 2022-04-19T05:57:02+05:30 IST