విధులు బహిష్కరించిన కాంట్రాక్టు కార్మికులు

ABN , First Publish Date - 2021-10-21T06:18:42+05:30 IST

హెచ్‌పీసీఎల్‌లో పలువురు కాంట్రాక్టర్లు కార్మికులకు నెలలు తరబడి వేతనాలు చెల్లించడం లేదు.

విధులు బహిష్కరించిన కాంట్రాక్టు కార్మికులు
విధులు బహిష్కరించి బయటకు వచ్చిన హెచ్‌పీసీఎల్‌ కాంట్రాక్టు కార్మికులు

మల్కాపురం, అక్టోబరు 20: హెచ్‌పీసీఎల్‌లో పలువురు కాంట్రాక్టర్లు కార్మికులకు నెలలు తరబడి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఎంతోమంది కాంట్రాక్టు కార్మికులు అర్థాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా బుధవారం సంస్థలో ఎల్‌ అండ్‌ టీ వద్ద సబ్‌ కాంట్రాక్టర్‌ పొందిన ఓ సంస్థ యజమాన్యం గత రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వందలాది మంది కార్మికులు ఒక్కసారిగా విధులను బహిష్కరించి బయటకు వచ్చేశారు. దీంతో సంస్థలో ఎంతో ముఖ్యమైన పనులు నిలిచిపోయాయి. జీతాలు చెల్లిస్తే తప్పా విధులకు హాజరుకామంటూ వారు సంస్థ యజమాన్యానికి తేల్చిచెప్పారు. 


Updated Date - 2021-10-21T06:18:42+05:30 IST