‘కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి’

ABN , First Publish Date - 2020-09-29T17:58:33+05:30 IST

ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత..

‘కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి’

ఏలేశ్వరం: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించి సీఎం జగన్‌ ఆదుకోవాలని జిల్లా ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వి.కనకరాజు కోరారు. 5042మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను ఆదుకునేందుకు 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి 12నెలల జీతాల చెల్లింపుల దస్త్రంపై సీఎం జగన్‌ సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏలేశ్వరంలో అధ్యాపకులు సోమవారం సంబరాలు నిర్వహించారు.


స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలవద్ద అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వి.కనకరాజు నేతృత్వంలో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అలమండ చలమయ్య, మూది నారాయణస్వామి, కళాశాల ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజు, ఎ.వెంకటరమణ, పలివెల శివాజీ, వాగు మాధవ్‌, జి.అనిల్‌కిరణ్‌, టి.అమర్‌కళ్యాణ్‌, సిహెచ్‌.జ్యోతి, ఎస్తేరు, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-09-29T17:58:33+05:30 IST