భార్యను హత్య చేయమని సుపారీ ఇచ్చిన భర్త.. కానీ ఆ సుపారీ కిల్లర్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-11T09:49:54+05:30 IST

మరో స్త్రీని వివాహం చేసుకునేందుకు ఒక యువకుడు అడ్డుగా ఉన్న తన భార్యను హత్య చేయాలనుకున్నాడు. అందుకు తనకు తెలిసిన ఒక వ్యక్తికి సుపారీ కింద కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి అతని ఇంట్లో ఒంటరిగా...

భార్యను హత్య చేయమని సుపారీ ఇచ్చిన భర్త.. కానీ ఆ సుపారీ కిల్లర్ ఏం చేశాడంటే..

మరో స్త్రీని వివాహం చేసుకునేందుకు ఒక యువకుడు అడ్డుగా ఉన్న తన భార్యను హత్య చేయాలనుకున్నాడు. అందుకు తనకు తెలిసిన ఒక వ్యక్తికి సుపారీ కింద కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి అతని ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను హత్య చేయాలి. కానీ ఆ సుపారీ కిల్లర్ అక్కడ హత్య చేయడానకి వెళ్లి ఒక తప్పు చేశాడు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నగరంలో నివసించే సందీప్ అనే యువకుడు తన భార్య చెల్లెలిని వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒక ప్లాన్ వేశాడు. మరదలిని పెళ్లి చేసుకోవాలంటే అడ్డుగా ఉన్న భార్యను తొలగించడానికి ఆమెను చంపాలనుకున్నాడు. అందుకోసం  తనకు తెలిసిన రామ్‌బీర్ సాహు అనే సుపారీ కిల్లర్‌ని సంప్రదించాడు. సాహు పగలు ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. రాత్రివేళ నేరం ప్రపంచంలో సుపారీ కిల్లింగ్ చేసేవాడు.


సందీప్ తన భార్యను హత్య చేసేందుకు సాహుకి ప్లాన్ వివరించాడు. ప్లాన్ ప్రకారం సందీప్ భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సాహు అక్కడికి వెళ్లి హత్య చేయాలి. ఆ తరువాత సందీప్ అక్కడికి వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాడు. కానీ సాహు అక్కడికి వెళ్లి సందీప్ భార్యను హత్య చేయడంతో పాటు.. ఆమె శవంపై అత్యాచారం చేశాడు. 


ఈ విషయం తెలియని సందీప్.. పోలీసులకు తన భార్యను ఎవరో హత్య చేశారంటూ ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య జరిగిన తరువాత శవంపై అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో పోలీసులు సందీప్, అతని మిత్రులకు మెడికల్ చెకప్ చేయించారు. సందీప్ మిత్రులలతో సాహు కూడా ఉన్నాడు. 


సాహు మెడికల్ పరీక్ష ఫలితాల ప్రకారం.. అతని వీర్య కణాలు మృతదేహం శరీరంలో దొరికిన వీర్యకణాలతో మ్యాచ్ అయ్యాయి. దీంతో పోలీసులు సాహుని అరెస్టు చేసి తమ పద్ధతిలో ప్రశ్నించారు. అప్పుడు సాహు జరిగిన విషయం చెప్పాడు. ఆ తరువాత పోలీసులు సందీప్‌ని కూడా అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-11T09:49:54+05:30 IST