Abn logo
Jul 26 2021 @ 00:53AM

సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి

ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేస్తున్న మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు

ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతి 

సికింద్రాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత, భూ బదలాయింపు తదితర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భూ బదలాయింపు, క్లార్‌ 2021 గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీకి వినతిపత్రం అందజేశారు. నామా నాగేశ్వర్‌రావును కలిసిన వారిలో కంటోన్మెంట్‌ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ సభ్యులు లోకనాథం, పాండుయాదవ్‌, నళినీకిరణ్‌, బి.ప్రభాకర్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ను కూడా వారు కలిశారు.