త్వరలోనే అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-20T05:15:50+05:30 IST

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మిగిలి పోయిన అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు.

త్వరలోనే అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణ పనులు ప్రారంభం


తలమడుగు, మే19: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మిగిలి పోయిన అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు. మహారాష్ట్ర కిన్వట్‌ తాలుకా ఎమ్మెల్యే కేరం భీంరావ్‌ను బోథ్‌ ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిసి అంతర్గత రోడ్డు నిర్మాణంపై చర్చించారు. మండలంలోని ఉమ్రి నుంచి గోగర్‌వాడి మీదుగా మాండబెల్లూరు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరుకానున్నాయన్నారు. రోడ్డు నిర్మాణంతో మహారాష్ట్ర - తెలంగాణ ప్రజలకు దాదాపుగా 50కి.మీ.ల దూరం తగ్గుతుందన్నారు. దీంతో చిరు వ్యాపారులకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. మాండ బెల్లూరు నుంచి గోగర్‌వరకు మహారాష్ట్ర ప్రభు త్వం రోడ్డు నిర్మాణం పూర్తి చేసింద గుర్తు చేశారు. ఆయన వెంట టీఆర్‌ ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ తోట వెంకటేశ్‌ తదితరులున్నారు. కాగా లక్ష్మిపూర్‌ చెక్‌పోస్టు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరుకాగానే పనులను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2022-05-20T05:15:50+05:30 IST