కెనడియన్‌ వుడ్‌తో విల్లాల నిర్మాణం భేష్‌

ABN , First Publish Date - 2022-05-25T05:09:27+05:30 IST

మ్యాక్‌ ప్రాజెక్టులోని కెనడియన్‌వుడ్‌ విల్లాల ప్రతిరూపాలను

కెనడియన్‌ వుడ్‌తో విల్లాల నిర్మాణం భేష్‌
తమ్మలూరు మ్యాక్‌ ప్రాజెక్టులో కెనడియన్‌ వుడ్‌ విల్లాను పరిశీలిస్తున్న నాగరాజ్‌

  • కర్ణాటక మున్సిపల్‌ శాఖ మంత్రి ఎమ్‌టీబీ నాగరాజ్‌


మహేశ్వరం, మే 24 : మ్యాక్‌ ప్రాజెక్టులోని కెనడియన్‌వుడ్‌ విల్లాల ప్రతిరూపాలను బెంగుళూర్‌లో కూడా ఏర్పాటు చేయడంపై కర్ణాటక రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖా మంత్రి ఎమ్‌.టి.బి. నాగరాజ్‌  హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో గల మ్యాక్‌ ప్రాజెక్ట్‌లో నిర్మిస్తున్న కెనడియన్‌ వుడ్‌ విల్లాను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెనడాలోని బ్రిటన్‌ కొలంబియా ప్రభుత్వ కీలక సంస్థ అయిన కెనడియన్‌ వుడ్‌ సహకారంతో ప్రపంచస్థాయి గేటేడ్‌ కమ్యూనిటీలో భాగంగా శ్రీశైలం హైవేదగ్గర ఉన్న మ్యాక్‌ ప్రాజెక్టులో కెనడియన్‌ వుడ్‌తో నిర్మించిన విల్లాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మ్యాక్‌ ప్రాజెక్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవాబ్‌మీర్‌నాసిర్‌ ఆలీఖాన్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-25T05:09:27+05:30 IST