లక్ష్యానికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం

ABN , First Publish Date - 2020-05-31T11:02:57+05:30 IST

జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం అంశాలలో లక్ష్యానికి

లక్ష్యానికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ శ్రీదేవసేన


ఆదిలాబాద్‌ టౌన్‌, మే 30: జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం అంశాలలో లక్ష్యానికి అనుగుణంగా చేపట్టాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లు, ఉపాధి హామీ, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఇంకుడు గుంతల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలన్నారు. హారితహారం కార్యక్రమం కింద జిల్లాలో మియావాక్‌ ప్లాంటేషన్‌లను పెద్దఎత్తున అనువుగా ఉన్న ప్రాం తాలలో కనీసం అర ఎకరంలో పెంప కం చేపట్టాలని సూచించారు. 


 అలాగే భూములకు సంబంధించిన వివరాలను ఐఎల్‌ఆర్‌ఎంఎ్‌సలో అప్‌డేట్‌ చేయాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. రైతులు సాగు చేసే పంటల వివరాలను విస్తీర్ణం ప్రకారం రానున్న రెండు రోజుల్లో పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, ఎం.డేవిడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రాథోడ్‌, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చందు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.

Updated Date - 2020-05-31T11:02:57+05:30 IST