దాతల సహకారంతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ నిర్మాణం

ABN , First Publish Date - 2022-06-27T05:14:58+05:30 IST

దాతల సహకారంతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ నిర్మాణం

దాతల సహకారంతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ నిర్మాణం
శామీర్‌పేట క్రీడాప్రాంగణంలో ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి

  • రూ.40లక్షలతో నిర్మించి దసరాకల్లా ప్రారంభిస్తాం
  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడికార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన

శామీర్‌పేట, జూన్‌ 26: దాతలు, జిల్లా రిజిస్ర్టార్ల సహకారంతో రూ.40లక్షలతో శామీర్‌పేటలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం శామీర్‌పేటకు ము ఖ్య అతిఽథిగా వచ్చిన మంత్రి.. జెడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జిల్లా రిజిస్ర్టా ర్‌ రమే్‌షరెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయి, సర్పంచ్‌ బాలమణిలతో కలిసి సబ్‌రిజిస్ర్టార్‌ కా ర్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శామీర్‌పేటలో అద్దెభవనంలో సబ్‌రిజిస్ర్టార్‌ కా ర్యాలయం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాతల సహకారంతో త్వరలోనే అన్ని హంగులతో కార్యాలయ భవాన నిర్మించి దస్రకల్లా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. 


  • క్రీడా ప్రాంగణం, ఓపెన్‌ జిమ్‌ ప్రారంభించిన మంత్రి

యువకులు, విద్యార్థులు క్రీడా సాధన చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మినీ స్టేడియం గ్రౌండ్స్‌లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని, ఓపెన్‌ జిమ్‌ను ఆయన ప్రారంభించారు. ఎంపీపీ, సర్పంచ్‌లతో కలిసి మంత్రి జిమ్‌ యంత్రాలపై కొద్దిసేపు వ్యాయామం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులను, యువకులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య బోధిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు జహీరుద్దీన్‌, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, సబ్‌రిజిస్ర్టార్‌ శేషగిరిచంద్‌, ఉపసర్పంచ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T05:14:58+05:30 IST