నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం

ABN , First Publish Date - 2022-05-17T05:14:47+05:30 IST

పేదరికంలో ఉండి ఇళ్ళు నిర్మించుకునే స్థోమత లేని నిరుపేదలకు జగనన్న కాలనీలలో తక్కువ ఖర్చుతో ఇళ్ళ నిర్మా ణం కాంట్రాక్టర్‌ల ద్వారా చేపట్టే ప్రక్రియకు ఉపక్రమించినట్లు శాప్‌నె ట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం
ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకి, మే 16: పేదరికంలో ఉండి ఇళ్ళు నిర్మించుకునే స్థోమత లేని నిరుపేదలకు జగనన్న కాలనీలలో తక్కువ ఖర్చుతో ఇళ్ళ నిర్మా ణం కాంట్రాక్టర్‌ల ద్వారా చేపట్టే ప్రక్రియకు ఉపక్రమించినట్లు శాప్‌నె ట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. పట్టణంలోని వేలమూరిపాడు రోడ్డు జగనన్న కాలనీలో త క్కువ ఖర్చుతో నిర్మించనున్న మోడల్‌ హౌస్‌కు సోమవారం కృష్ణచైత న్య, నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ పట్టణంలోని మూడు జగనన్న కాలనీలలో ఒక్కొక్కటి చొప్పున నిర్మాణం చేయటం జరుగుతుందన్నా రు. వాటి ఖర్చు ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే నగదు  పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సొంతంగా ఇళ్ళు నిర్మాణం చేసుకోలేని లబ్ధిదారుల కోసం ప్రయోగాత్మకంగా చేపడుతు న్నట్టు చెప్పారు. అనంతరం పట్టణంలోని ఎల్‌ఈఎఫ్‌ నగర్‌, రామ్‌నగ ర్‌లలో కొత్తగా చేపట్టాల్సిన రోడ్లు, సైడ్‌ డ్రైన్‌లు, కల్వర్ట్‌లను పరిశీలిం చారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మన్‌లు పద్మేష్‌, అనంతలక్ష్మి, కమిషనర్‌ ఫజులుల్లా, ఏఈ శ్రీరామ మూర్తి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి  రమేష్‌, కౌన్సిలర్‌లు  పాల్గొన్నారు.


త్వరితగతిన గృహాలు నిర్మించుకోవాలి

పంగులూరు, మే 16: పీఎంజీవై పథకం ద్వారా పక్కాగృహాల మం జూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని శాప్‌నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య అన్నారు. సోమవారం పంగులూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఈ ప థకం ద్వారా గృహాలు పొందిన 485 మంది లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలను అందజేశారు. హౌసింగ్‌ డీఈఈ శర్మ మాట్లా డుతూ  బూదవాడలో 159 గృహాలు, చందలూరులో 123, కొండముం జులూరులో ఒకటి, కోటపాడులో 34, నూజెళ్ళపళ్ళిలో 49, పంగులూ రులో నాలుగు, రామకూరులో 16, తూర్పుకొప్పెరపాడులో 39, తూర్పు తక్కెళ్ళపాడులో 60 గృహాలు రిజిష్టర్‌ అయినట్లు తెలిపారు. 

కార్యక్రమంలో ఎంపీపీ తేళ్ళ నాగమ్మ, జడ్పీటీసీ రాయిణి ప్రమీల, ఎంపీడీవో రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస రెడ్డి, సర్పంచ్‌ గుడిపూడి నాగేంద్రం, వైసీపీ నాయకులు రాయిణి వెంకట సుబ్బారావు, గాదె బ్రహ్మారెడ్డి, ఏఈ రమేష్‌, కోఆప్షన్‌ సభ్యులు పఠాన్‌ ఖాశీం ఖాన్‌, మోజస్‌ తదితరులు పాల్గొన్నారు.


పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంతమాగులూరు, మే 16: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమ ని శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య తెలిపారు. సోమవారం మం డలంలోని కుందుర్రులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలను ఇంటింటికి వెళ్ళి వివరించారు. అంతకుముందు కుందుర్రు విచ్చేసిన  కృష్ణచైతన్య కు గ్రామ ప్రజలు, మహిళలు పూలతో, హారతులిచ్చి ఘనస్వాగతం ప లికారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ అట్లా పెద వెంకట రెడ్డి, జడ్పీటీసీ అడవి శ్రీనివాసరావు, సర్పంచ్‌ బొమ్మినేని నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:14:47+05:30 IST