Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీచు పదార్థం ఉండాల్సిందే!

ఆంధ్రజ్యోతి(28-04-2021)

మలబద్ధకం సమస్యను చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ అది చాలా సమస్యలకు కారణమవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో మలబద్ధకం దరిచేరకుండా చూసుకోవచ్చు. అవేమిటంటే...


మలబద్ధకం దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజు ఆహారంలో పీచుపదార్థం ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేట్‌ అయినపుడు పేగులలో కదలికలు తగ్గిపోతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కనీసం రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. 


బీన్స్‌, బ్రకోలి, క్యాబేజీ, క్యారెట్‌, పాలకూర  మెనూలో ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్‌ రైస్‌, బార్లీ వంటివి తింటే తగినంత పీచుపదార్థం లభిస్తుంది.


పైనాపిల్‌, పియర్స్‌, బొప్పాయి, బెర్రీ, ఆపిల్‌ వంటి పండ్లు విరివిగా తింటూ ఉండాలి. 


డ్రై ఫ్రూట్‌ తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అప్రికాట్‌, డేట్స్‌ మలబద్ధకాన్ని తగ్గించడంలో బాగా తోడ్పడతాయి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...