కుట్రలను ఎండగడతాం : మంత్రి

ABN , First Publish Date - 2022-08-20T06:06:22+05:30 IST

మునుగోడులో ప్రజాదీవెన సభను లక్ష మందితో విజయవంతంగా నిర్వహిస్తాం. అన్ని గ్రామాల నుంచి బ్రహ్మాండంగా జనం తరలివస్తారు.

కుట్రలను ఎండగడతాం : మంత్రి
మునుగోడులో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

బీజేపీది మూడో స్థానమే 

 పార్టీలో అసమ్మతి లేదు

మునుగోడు, ఆగస్టు 19: మునుగోడులో ప్రజాదీవెన సభను లక్ష మందితో విజయవంతంగా నిర్వహిస్తాం. అన్ని గ్రామాల నుంచి బ్రహ్మాండంగా జనం తరలివస్తారు. లక్షన్నర మందికి సరిపడా మైదానాన్ని సిద్ధం చేశాం. మా నాయకుడు సీఎం కేసీఆర్‌ను చూసేందుకు, ప్రసంగాన్ని వినేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి స్వార్థం మూలంగా వచ్చింది, దీని వెనక ఎవరి కుట్రలు ఉన్నాయో సీఎం వివరిస్తారు. రాజకీయాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోంది. ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటోంది. విద్యుత్‌, వ్యవసాయం ఇలా అన్నింటిలో కేంద్రం వివక్ష చూపుతున్న విషయాలను సీఎం వివరించనున్నారు. పార్టీలో అసమ్మతి లేనేలేదు. మునుగోడులో గెలిచే పార్టీ మాది కావడంతో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందరినీ సంప్రదించి సరైన అభ్యర్థిని ప్రకటిస్తాం. నియోజకవర్గంలో మాతో పోటీ పడేది కాంగ్రెస్‌ మాత్రమే.  


సభకు పకడ్బందీ భద్రత : ఐజీ కమలాసన్‌రెడ్డి

 సీఎం కేసీఆర్‌ సభకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఐజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సభా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరితో కలిసి శుక్రవారం పరిశీలించారు. సభ కోసం ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25మంది డీఎస్పీలు, 50మంది సీఐలు, 94ఎస్‌ఐలు, 198మంది ఏఎ్‌సఐలతో కలిపి 2వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, సభ నేపథ్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను మధ్యాహ్నం 1  నుంచి 2గంటల వరకు చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా మళ్లించనున్నారు.

Updated Date - 2022-08-20T06:06:22+05:30 IST