Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 7 2021 @ 10:57AM

బెంగాల్ ఫైట్: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

కలకత్తా: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. పోటాపొటీగా ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ఇందులో మొత్తం 13 మంది పేర్లను వెల్లడించింది. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు ఫేజ్‌ల కోసం ఈ జాబితాను ప్రకటించినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ శాసనసభ డిప్యూటీ నాయకుడిగా పనిచేసిన నేపాల్ మెహతా భాగ్‌ముండీ ప్రాంతం నుంచి పోటీ చేయనున్నారు. కాగా.. ఈ 13 మంది అభ్యర్థుల్లో ఏడుగురు కొత్తవారు కావడం విశేషం.

అలాగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల కోసం 40మంది అభ్యర్థులను ఈ జాబితాలో కాంగ్రెస్ ప్రకటించింది. అస్సాం పీసీసీ ప్రెసిడెంట్ రిపున్ బోరాకు గోహ్‌పుర్ నియోజకరవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement