Viral Video: తలపై చున్నీ వేసుకుని మరీ ఎర్రటి ఎండలో పొలంలో పనిచేస్తున్న ఈ మహిళ ఎవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-20T02:06:41+05:30 IST

తలపై చున్నీ వేసుకుని.. ఎర్రటి ఎండలో పొలంలో పని చేస్తున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అందులో ఉన్న మహిళను చూసి అవాక్కవుతున్నారు. ‘ఈమేంటి ఇలా పని చేయడం ఏంటి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు అంతలా ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటనేగా మీ సందేహం. అక్క

Viral Video: తలపై చున్నీ వేసుకుని మరీ ఎర్రటి ఎండలో పొలంలో పనిచేస్తున్న ఈ మహిళ ఎవరో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: తలపై చున్నీ వేసుకుని.. ఎర్రటి ఎండలో పొలంలో పని చేస్తున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అందులో ఉన్న మహిళను చూసి అవాక్కవుతున్నారు. ‘ఈమేంటి ఇలా పని చేయడం ఏంటి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు అంతలా ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. ఆమె గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా నోరెళ్లబెట్టడం ఖాయం. కాగా.. ఆమె గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..





ప్రస్తుతం సదుల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలకు సేవ చేస్తున్న ఆమె.. తాజాగా తన అత్తగారింటికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె పొలానికి వెళ్లి.. అక్కడ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు మహిళలు కూర్చుని చిరుధాన్యాలను సేకరించడాన్ని చూసిన ఆమె.. వెంటనే వారి వద్దకు వెళ్లారు. అనంతరం వారితోపాటు నేలపై కూర్చుని.. మహిళలతో ముచ్చటిస్తూ ఆమె కూడా చిరుధాన్యాలను సేకరించడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఎర్రటి ఎండలో తలపై చున్నీ వేసుకుని పొలంలో పనులు చేస్తున్న కృష్ణ పూనియాను చూసి, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మే 5,1977లో హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కృష్ణ పూనియా.. చిన్ననాటి నుంచి పాడి పనులు చేస్తూ పెరిగారు. 



ముగ్గురు నలుగురు మహిళలతో కలిసి ఎర్రటి ఎండలో నేలపై కూర్చుని చిరు ధాన్యాలను సేకరిస్తున్న ఆమె పేరు కృష్ణ పూనియా. భారత క్రీడాకారిణి. కృష్ణ పూనియా.. కామన్ వెల్త్ గేమ్స్‌లో (2010) డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించి భలా అనిపించారు. ఆసియన్ గేమ్స్‌లో కూడా కాంస్యాన్ని కొల్లగొట్టిన ఈమె.. 2008, 2012లో ఒలింపిక్స్‌లో పాల్గొని అద్భత ప్రతిభ కనబర్చారు. అనంతరం ఈమె 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి దిగారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని సదుల్పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2018లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 




Updated Date - 2021-10-20T02:06:41+05:30 IST