ఐదు రాష్ట్రాల్లోనూ గెలుపు కాంగ్రెస్‌దే: ఖర్గే

ABN , First Publish Date - 2022-01-09T00:02:53+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ మంచి ఫలితాలు..

ఐదు రాష్ట్రాల్లోనూ గెలుపు కాంగ్రెస్‌దే: ఖర్గే

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని, అన్ని రాష్ట్రాల్లోనూ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ శనివారంనాడు ప్రకటించిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉందని, సామాజిక విద్వేషాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఓటర్లు ముఖ్యంగా యువత, మహిళలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. 


చిన్న పార్టీలకే సమస్య...

జనవరి 15 వరకు రోడ్డు షోలు, పాదయాత్రలు నిర్వహించేందుకు అనుమతి లేదని, పార్టీలు వర్చువల్ విధానంలో ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించడంపై ఖర్గే స్పందిస్తూ, ఈసీ నిర్ణయం అధికార పార్టీకి సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే పలు రాజకీయ ర్యాలీలు నిర్వహించారని, గత కొద్ది నెలులుగా ఆయన వరుస పర్యటనలు జరుపుతున్నారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 10 నుంచి 15 పర్యటనలు చేశారని, అధికార పార్టీకి వరకూ ఇందువల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. అయితే, ఆర్థికంగా బలహీనంగా ఉండే పార్టీలకే సమస్య ఉంటుంనది  ఖర్గే అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-01-09T00:02:53+05:30 IST