మోదీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌

ABN , First Publish Date - 2020-08-10T07:43:07+05:30 IST

ప్రధాని మోదీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేసిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీతూ పట్వారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే...

మోదీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌

  • మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీతూ పట్వారీపై కేసు

ఇండోర్‌, ఆగస్టు 9: ప్రధాని మోదీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేసిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీతూ పట్వారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ ముఖానికి మాస్కు ధరించి, తన చేతిలో ఓ మట్టిపాత్ర పట్టుకుని ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటోను జీతూ పట్వారీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో హిందువుల మనోభావాలని, ప్రధాని గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని బీజేపీ నేత  గౌరవ్‌ రందివె ఫిర్యాదు చేయడంతో జీతూ పట్వారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-08-10T07:43:07+05:30 IST