పేదల డబ్బు గుంజుతున్న జగన్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-09T05:29:14+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదల నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారని ఏలూరు పార్లమెంట్‌ జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు జెట్టి గురునాథరావు ఆరోపించారు.

పేదల డబ్బు గుంజుతున్న జగన్‌ ప్రభుత్వం
జంగారెడ్డిగూడెంలో మాట్లాడుతున్న జెట్టి గురునాథరావు

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 8: రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదల నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారని ఏలూరు పార్లమెంట్‌ జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు జెట్టి గురునాథరావు ఆరోపించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ ప్రధానమం త్రిగా పేదలకు ఇళ్లు, ఇళ్ల కాలనీలు, ఇళ్ల స్థలాలు ఇచ్చారని, తరువాత కాంగ్రెసు పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రులు రాజశేఖర్‌ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో పేదవారికి ఇళ్లు మంజూరు చేసి ఉచి తంగా ఇవ్వడం జరిగిందన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి వన్‌టైం సెటిల్‌ మెంట్‌ పట్టా పేరుతో పేదల నుంచి రూ.15వేలు, రూ.20వేలు వసూలు చేయడాన్ని కాంగ్రెసు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పేదలపై పెను భారం మోపవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, చిన్ని రామసత్యనారాయణ, మండల అధ్యక్షుడు నులకాని నాగబాబు, పట్టణ అధ్యక్షుడు ప్రగలపాటి కాశీ, పట్టణ కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు, తాడేపల్లి ఉమాదేవి, మొగల్నీడి శ్యామ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు జీడి కంటి రామారావు, దున్న శివ, జమీర్‌, హీరాహకీమ్‌ తదితరులు పాల్గొన్నారు.


దేవరపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని కాంగెస్‌ నేత మార్టిన్‌ లూథర్‌ విమర్శించారు. దుద్దుకూ రులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు బుధవారం జనజాగరణ యాత్ర నిర్వహిం చారు. మార్టిన్‌ లూథర్‌ మాట్లాడుతూ మోదీ అరాచకపాలన అప్రజాస్వామిక విధానాలతో పన్నులపై పన్నులు వేసి భారం మోపుతున్నారన్నారు. గడిచిన ఏడు సంవత్సరాల్లో దేశ ప్రజలు బాధలు వర్ణానాతీతంబ అన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం మోదీకి దాసోహం అంటుందని విమర్శించారు. పీసీసీ అమార్జహాబేగ్‌, జ్యేష్ట సతీష్‌బాబు, అరిగెల అరుణ, రఫీ ఉల్లాబేగ్‌, వెలగా రామకృష్ణ, గన్నిన రామారాయుడు, చాపల వెంకటేశ్వరరావు, కాకర్ల హరిబా బు, పిట్టా రామారావు, శేఽషగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:29:14+05:30 IST