Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెద్దన్నయ్యను కోల్పోయా: KVP

హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మరణంతో పెద్దన్నయ్యను కోల్పోయానని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు.  రోశయ్యతో తనకు, వైఎస్‌కు విడదీయరాన్ని బంధం ఉందని తెలిపారు. రోశయ్య నుంచి వైఎస్ఆర్ ఆర్థిక‌ క్రమశిక్షణ నేర్చుకున్నారన్నారు. రోశయ్య గొప్ప కాంగ్రెస్ వాది అని ఆయన మరణం తీరని లోటని అన్నారు. నిద్రలోనే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారన్నారు. రోశయ్య పార్థీవదేహానికి వైద్యులు ఎంబాల్మింగ్ చేస్తున్నారని.. కాసేపట్లో ఇంటికి తీసుకెళ్తారని తెలిపారు. రేపు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్ధం రోశయ్య పార్టీవదేహాన్ని ఉంచుతామని చెప్పారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ భవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమవుతోందని... జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేవీపీ తెలిపారు. 

Advertisement
Advertisement