రైతుకు కాంగ్రెస్‌ అండ

ABN , First Publish Date - 2022-05-22T05:52:48+05:30 IST

తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉం టుందని టీపీసీసీ కార్యదర్శి జీ. మధుసుదూన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రశాంత్‌రెడ్డి, అన్నారు.

రైతుకు కాంగ్రెస్‌ అండ
రైతు రచ్చబండ కార్యక్రమంలో ముందుగా రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

-వరంగల్‌ డిక్లరేషన్‌పై అవగాహనకు

 రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం

 - పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర/ మహమ్మదాబాద్‌/ గండీడ్‌, మే 21 : తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉం టుందని టీపీసీసీ కార్యదర్శి జీ. మధుసుదూన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రశాంత్‌రెడ్డి, అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు శనివారం మండల పరిధిలోని చిన్నరాజ మూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31వ వర్ధం తి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ను వివరించా రు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ ఏక కాలంలో అమలు చేస్తామని తెలిపారు. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఏటా 15 వేలు ఇస్తామన్నారు. నిరుపేద ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేలు అంది స్తామన్నారు. రైతు బీమా వర్తింపజేసీ పేద భూముల రక్షణకు ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమా ఫీ చేసి ఉచిత విద్యుత్‌ను అందజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు ఆరవింద్‌కు మార్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కుర్వ రాందస్‌, నాయకులు శ్రీనువాసలు, గోపాల్‌, భరత్‌ పాల్గొన్నారు.

ఫ మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలోని అంబే డ్కర్‌ చౌరస్తాలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మో హన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ల జీవితాల్లో వెలుగులు నింపేందకు వరగంల్‌లో జరిగిన సభలో డిక్లరేషన్‌ ప్రకటించడం జరిగిందన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, పీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పీఈటీ రా ములు, ఉపాధ్యక్షులు విష్ణువర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకురాలు రాధమ్మ, మాచారం రాఘ వేందర్‌ రెడ్డి, అశోక్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

ఫ రైతుల  సమ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని  పరిగి మాజీ ఎమ్మెల్యే, వికారా బాద్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నా రు.  టీపీసీసీ అదేశాలమేరకు వరంగల్‌ డిక్లరేషన్‌పై శనివారం గండీడ్‌లో  రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి  కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరసింహా రావు, మాజీ వైస్‌ ఎంపీపీ రాధారెడ్డి, సర్పంచులు జిత్తేందర్‌రెడ్డి, శ్రీనావాస్‌, ప్రభాకర్‌రెడ్డి, కాజప్ప, ఎంపీటీసీలు బాలయ్య, వెంకట్‌రాంరెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బాలస్వామి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఆశన్న, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, దిగంబర్‌రావు, వెంకట్‌మాదవ్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:52:48+05:30 IST