Assam-Mizoram dispute: అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ డిమాండ్

ABN , First Publish Date - 2021-07-29T02:58:21+05:30 IST

Assam-Mizoram dispute: అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ డిమాండ్

Assam-Mizoram dispute: అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ డిమాండ్

గువాహటి: అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రిపున్ బోరా డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన బుధవారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేసి సమస్యను పరిష్కరించకపోతే అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.


ఇరు రాష్ట్రాల మధ్య లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవుల విషయంలో వివాదం సరిహద్దులో పెద్ద వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కల్పించుకోవాలంటూ విజ్ణప్తులు కూడా చేశారు. అయితే కేంద్రం సూచనల మేరకు అస్సాం పోలీసులు 100 మీటర్లు వెనక్కి తగ్గినప్పటికీ మిజోరాం పోలీసులు మాత్రం సాయుధులై అక్కడే తిష్ట వేశారు. అనంతరం అసోం ప్రభుత్వం కచార్‌లో మూడు బెటాలియన్ల కమాండోలను సరిహద్దులో మోహరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా, ఈ ఉద్రిక్తతలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. హోంమంత్రి అమిత్‌షా ఈ దేశాన్ని ఫెయిల్‌ చేయిస్తున్నారంటూ ట్విటర్‌లో విమర్శించారు.

Updated Date - 2021-07-29T02:58:21+05:30 IST