రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు : డీసీసీ

ABN , First Publish Date - 2020-12-06T04:53:17+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ వ్యవసాయానికి దూరం చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు.

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు : డీసీసీ
నియామకపత్రాన్ని అందజేస్తున్న డీసీసీ చైర్మన్‌ చెవిటి వెంకన్నయాదవ్‌

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ వ్యవసాయానికి దూరం చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. రెడ్‌హౌజ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్‌ పార్టీకి గెలుపోటములు కొత్తేమికాదన్నారు. అనంతరం డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. కుంట్ల వెంకటనాగిరెడ్డి, పోలగాని బాలుగౌడ్‌, పంతంగి మల్సూర్‌, పల్స వెంకన్న, యాదగిరి, సతీష్‌, మోరపాక సత్యంలతో పాటు మొత్తం 34 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు అంజద్‌అలీ, చెంచల శ్రీనివాస్‌, ధరావత్‌ వీరన్ననాయక్‌, ముక్కాల అవిలమల్లుయాదవ్‌, రావుల రాంబాబు, శ్రీనివా్‌సరావు, కర్ణాకర్‌రెడ్డి, రమేష్‌, శేఖర్‌, నరేందర్‌నాయుడు పాల్గొన్నారు. 


చిలుకూరు: కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా రామాపురం గ్రామానికి చెందిన కీత వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్‌ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


నాగారం: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆకుల బుచ్చిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా తన నియామకపత్రానికి సహకరించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుడిపాటి నర్సయ్య, చెవిటి వెంకన్నలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  


హుజూర్‌నగర్‌ : యూత్‌ కాంగ్రెస్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కుక్కడపు మహేష్‌ ఎన్నికయ్యారు. జేఏసీ నాయకుడిగా, ఎన్‌ఎ్‌సయూ అధ్యక్షుడిగా అనేకసార్లు పనిచేసిన మహేష్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికలో విజయం సాధించాడు.  


చివ్వెంల: గుంజలూరు గ్రామానికి చెందిన, మాజీ సర్పంచ్‌ అమరారపు శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించన మాజీమంత్రి దామోదర్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు.


పెన్‌పహాడ్‌: నాగులపాటిఅన్నారం గ్రామానికి చెందిన మీసాల ప్రశాంత్‌ కుమార్‌ సూర్యాపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.


అర్వపల్లి : కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా చాకలిగూడెం గ్రామానికి చెందిన మోరపాక సత్యం నియమితులయ్యారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వారికి అభినందనలు తెలిపారు.


కోదాడ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కోదాడకు చెందిన చింతలపాటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్యులు జారీచేశారు. తన నియామకానికి సహకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-06T04:53:17+05:30 IST