Advertisement
Advertisement
Abn logo
Advertisement

కవి అరవిందరాయుడికి అభినందనలు

లేఖ పంపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మోత్కూరు, అక్టోబరు 16: మోత్కూరుకు చెందిన కవి అరవిందరాయుడు రచించిన ‘నానీ విహంగాలు’ కవితా సంపుటిని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన్ను అభినందిస్తూ లేఖ రాశారు. సమాజపు ఆలోచలను సాహిత్యం ప్రభావితం చేస్తుందని, అందుకు మంచి సాహిత్యంరావాలని, దాని నుంచి యువత స్ఫూర్తి పొందాలని లేఖలో ఆకాంక్షించారు. సాహిత్యానికి పరిమితులు ఉండవని ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న సూక్తిని అనుసరించి రసస్ఫూర్తిని రగిలించే చిన్న మాట కూడా కావ్యంతో సమానమేనన్నారు. ‘నానీ’లు పుస్తకం చదువుతుంటే అదే అనుభూతి కలిగిందని, ‘నానీ విహంగా లు’ యువతలో ప్రేరణ కలిగిస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement