ఉంటుందో.. ఊడతుందో..?

ABN , First Publish Date - 2020-10-01T09:20:13+05:30 IST

తహసీల్దార్‌ కార్యాల యం, గ్రామాల్లో ఎనిమిది సంవత్స రాలుగా విధులు నిర్వర్తిస్తున్నా.. తమ ఉద్యోగంపై అయోమ యంగానే ఉన్నామని వీఆర్‌ఏలు

ఉంటుందో.. ఊడతుందో..?

ఉద్యోగంపై అయోమయంలో వీఆర్‌ఏలు

పూర్తి వివరాలు సేకరిస్తున్న అధికారులు

విద్యార్హతను బట్టి ఇతర శాఖల్లో ఉద్యోగ అవకాశాలు


మోమిన్‌పేట : తహసీల్దార్‌ కార్యాల యం, గ్రామాల్లో ఎనిమిది సంవత్స రాలుగా విధులు నిర్వర్తిస్తున్నా.. తమ ఉద్యోగంపై అయోమ యంగానే ఉన్నామని వీఆర్‌ఏలు వాపోతున్నారు. 2012, 2014 సంవత్సరాల్లో డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా వీఆర్‌ఏ ఉద్యోగం సాధించారు. అప్పటినుంచి ఇప్పటివరకు రూ.10,500 జీతం పొం దుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం రెవెన్యూశాఖపై తీసు కున్న నిర్ణయం కిందిస్థాయి ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. ఇప్ప టికే వీఆర్వో వ్యవస్థ పూర్తిగా రద్దు చేయగా... ప్రస్తుతం వీఆర్‌ఏలను కూడా తొల గించే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ఒక్క గ్రామంలో ముగ్గురు నుంచి నలుగురు వీఆర్‌ఏలు పనిచేస్తుండగా, ప్రస్తుతం ఒక్కరినే ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో ఎవరి ఉద్యోగం ఉంటదో.. ఎవరిది ఊడతాదో తెలియని గందరగోళ పరిస్థితి నెల కొంది. అయితే వీఆర్‌ఏలకు స్కేలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని అర్హత బట్టి అదే శాఖలో ఉంచి.. మిగిలిన వారిని ఇతర శాఖలకు బదలా యిస్తారని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 


మోమిన్‌పేట మండల పరిధిలోని 28 గ్రామపంచా యతీల్లో డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఐదుగురు వీఆర్‌ఏలు, 25మంది పాత వీఆర్‌ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. మండలంలో 11 వీఆర్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే చాలామంది ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తుండగా, మరికొంతమంది కొత్తగా 2012, 2014 డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఎంసీఏ, పీజీ, డిగ్రీలు, ఇంటర్‌ చదువుకున్నవారున్నారు. ప్రస్తుతం పెద్ద పంచాయతీల్లో ముగ్గురు, నలుగురు వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు గ్రామానికి ఒక్క వీఆర్‌ఏ అని నిబంధన పెట్టింది. మిగిలిన వారిని ఇతర శాఖలకు బదలా యించాల్సి ఉంటుంది. అర్హతను బట్టి ఇతర శాఖలకు బదిలీ చేస్తా మని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు వీఆర్‌ఏల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారి వయసు, రిటైర్‌మెంట్‌ తేది, చదువులు తదితర విషయాలు సేకరి స్తున్నారు. కాగా ఈ విభజనతో ఎంతమంది పోస్టులు ఉంటాయో, ఎంత మంది ఇతర శాఖలకు వెళ్లాల్సి వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. 


రెవెన్యూలో సర్దుబాటు చేశాకే ఇతర శాఖల్లోకి..

వీఆర్వోలు, వీఆర్‌ఏలను రెవెన్యూశాఖలో ఏర్పడిన ఖాళీల్లో సర్దుబాటు చేశాక మిగిలిన వారిని ఇతర శాఖల్లోకి పంపించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో 5,657 వీఆర్వోల పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తూ చట్టం తెచ్చిన విషయం విధితమే. వీఆర్‌ఏలకు కూడా పేస్కేలు ఇచ్చి తుది నిర్ణయం తీసు కుంటారు. గ్రామానికో వీఆర్‌ఏ లేకుంటే ఇబ్బందులు వస్తాయని రెవెన్యూ సంఘాలు కూడా నివేదిక అందించాయి. దీంతో ప్రతి గ్రామంలో ఒక వీఆర్‌ఏను పెడతామని సీఎం కేసీఆర్‌ శాసన మండలిలో ప్రకటన చేశారు. దాంతో వీఆర్‌ఏల్లో 80శాతం పైగా రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. 


ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం

డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ద్వారా 2012-14లో ఉత్తీర్ణులైన వీఆర్‌ఏలకు తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా విద్యార్హతను బట్టి తీసుకుని మా సేవలు వినియో గించుకోవాలి. వీఆర్‌ఏగా డిగ్రీలు, పీజీలు చేసి అనుభవం కలిగిన వారున్నారు. ప్రభుత్వం వెంటనే డైరెక్టు వీఆర్‌ఏలను వినియోగించుకోవాలి.       

      - ఎన్‌.ప్రవీణ్‌కుమార్‌, వీఆర్‌ఏ (ఏపీపీఎస్సీ), ఎన్కతల

Updated Date - 2020-10-01T09:20:13+05:30 IST