గందరగోళంగా ఆనందయ్య మందు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-19T05:57:31+05:30 IST

ఆనందయ్య మందు పంపిణీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్క్‌ కనిపించింది. ఆశతో వచ్చిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నిరాశే మిగిలింది. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆనందయ్య మందు పంపిణీ చేపట్టారు. ఇక్కడ అడుగడునా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది.

గందరగోళంగా ఆనందయ్య మందు పంపిణీ
మందు పంపిణీలో గందరగోళం

 పంపిణీలో వైసీపీ మార్క్‌

 ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మధ్య తోపులాట

చోద్యం చూసిన పోలీసులు

మద్దిలపాలెం, జూన్‌ 18: ఆనందయ్య మందు పంపిణీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్క్‌ కనిపించింది. ఆశతో వచ్చిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నిరాశే మిగిలింది. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆనందయ్య మందు పంపిణీ చేపట్టారు. ఇక్కడ అడుగడునా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మధ్యాహ్నం 12 గంటలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తారని ప్రకటించడంతో గంట ముందే పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి పది మందికి మందు పంపిణీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మందు కోసం ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో వైసీపీ నాయకులు మందును వేరే గదిలోకి తీసుకుని వెళ్లిపోయారు. దీంతో అప్పటికే చాలా సమయం నుంచి వేచివున్న వారియర్స్‌ ఆందోళన చేశారు.  మందు పంపిణీ సమయంలో కొవిడ్‌ నిబంధనలు కనిపించేదు. ఏ ఒక్కరూ భౌతికదూరం పాటించలేదు. గుంపులుగా వందలాది మంది ఎగబడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడడమే తప్ప  ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొద్దిమందికి మాత్రమే  మందు పంపిణీ చేసి, మిగిలినది దాచివేయడంతో ఆశతో వచ్చిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ నిరాశగా వెనుదిరిగారు. 



Updated Date - 2021-06-19T05:57:31+05:30 IST