ఆరు విభాగాల్లో సర్వే నిర్వహించండి

ABN , First Publish Date - 2020-04-03T11:20:43+05:30 IST

కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో ఆరు విభాగాల్లో సర్వే నిర్వహించి, రెండు రోజుల్లో నివేదికను అందించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు.

ఆరు విభాగాల్లో సర్వే నిర్వహించండి

రెండు రోజుల్లో నివేదిక అందించాలి

చిత్తశుద్ధితో విధులు నిర్వహించండి 

టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ 


విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌ 2 : కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో ఆరు విభాగాల్లో సర్వే నిర్వహించి, రెండు రోజుల్లో నివేదికను  అందించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. గురువారం  కలెక్టర్‌ చాంబర్‌లో మండల, పంచాయతీ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, గ్రామ/ వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో  విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో చురుగ్గా సర్వే నిర్వహించా లన్నారు.  గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, మెడికల్‌, మండల అధికారుల  సంతకాలు తీసుకుని, ఆ తర్వాత  డాటాను కలెక్టరేట్‌ కు పంపించాలని ఆదేశించారు.   సర్వే నిర్వహించిన తరువాత అసిస్టెంట్‌ కలెక్టర్‌ చేతన్‌ గార్గ్‌ మరో మారు ఆయా ప్రాం తాల్లో  పరిశీలన చేస్తారని  వివరించారు. 


  సర్వే ఇలా.. 

విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించాలి. ఫ ఢిల్లీ నుంచి వచ్చినవారిని గుర్తించాలి. ఫ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చివారి వివరాలు సేకరించాలి. ఫ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వివారాలు పొందుపరచాలి ఫ పొడిదగ్గు, జ్వరం, గొంతునొప్పి, జలుబు, శ్వాసకోశ సంబంధ వ్యాధలను గుర్తించాలి ఫ 55 ఏళ్లు పై బడిన వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థి తులను తెలుసుకోవాలి. ఇలా ఆరు విభాగాల్లో సర్వేను రెండు రోజుల్లో  పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఇన్‌చార్జి  డీపీవో కె. సునీల్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే అనేక చోట్ల పారిశుధ్య పనులు  పూర్తిచేశామని, ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే త్వరాగా చేపట్టాలని సూచించారు.  కాలువల్లో తీసిన పూడికను వెంటనే అక్కడ నుంచి తరలించాలన్నారు.  పూడిక తీసిన ప్రదేశాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని తెలిపారు. 

Updated Date - 2020-04-03T11:20:43+05:30 IST