అక్కడ Condoms చాలా కాస్ట్లీ.. ఒక్క ప్యాకెట్ ధర రూ.60వేలు.. అయినా వెనక్కి తగ్గని జనం!

ABN , First Publish Date - 2022-07-09T18:33:06+05:30 IST

HIV-AIDS ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు.. శృంగార సమయంలో Condoms‌ను ఉపయోగిస్తారు. గర్భనిరోధక కవచంగా కూడా ఇవి పని చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చా

అక్కడ Condoms చాలా కాస్ట్లీ.. ఒక్క ప్యాకెట్ ధర రూ.60వేలు.. అయినా వెనక్కి తగ్గని జనం!

ఇంటర్నెట్ డెస్క్: HIV-AIDS ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు.. శృంగార సమయంలో Condoms‌ను ఉపయోగిస్తారు. గర్భనిరోధక కవచంగా కూడా ఇవి పని చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా దేశాల్లో ప్రజలు HIV-AIDS బారిన పడకుండా ఉండేందుకని.. అక్కడ ప్రభుత్వాల్లో కండోమ్‌లపై విస్తృతంగా అవగాహన కల్పించడమే కాకుండా.. వాటిని ఫ్రీగా సరఫరా చేస్తున్నాయి. కానీ ఓ ప్రదేశంలో మాత్రం.. Condoms చాలా కాస్ట్లీ. ఒక్క ప్యాకెట్ ధర.. లేటెస్ట్ ఐఫోన్ ధరకు సమానం. అయినా అక్కడి ప్రజలు మాత్రం.. అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఎంత డబ్బైనా ఖర్చు చేసి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం వింతగా అనిపించినా ఇది నిజం. కాగా.. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



దక్షిణ అమెరికాకు చెందిన Venezuela‌ దేశంలో కండోమ్‌ల ఖరీదు భారీగా ఉన్నాయి. ఒక్క ప్యాకెట్ ధర రూ.60వేల వరకు ఉంది. అంత ఖరీదైనప్పటికీ అక్కడి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే.. దానికి ఓ పెద్ద కారణమే ఉంది. వెనెజులాలో అబార్షన్లు చట్ట విరుద్ధం. అక్కడ ఎవరైనా అబార్షన్ చేయించుకుంటే.. కఠిన శిక్షలు తప్పవు. దీంతో అక్కడి ప్రజలు.. Condoms‌ను ఆశ్రయిస్తున్నారు. జైలుకు వెళ్లడం కంటే.. కండోమ్స్‌ను వాడటం ఉత్తమం అని భావిస్తున్నారు. గర్భ నిరోధాకానికి అంత ఖర్చు చేసి కండోమ్స్‌నే ఎందుకు వాడటం.. మాత్రలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి కదా అనే సందేహం మీకు కలగొచ్చు. కానీ.. అక్కడ కండోమ్స్‌కు ఉన్న డిమాండే మాత్రలకు కూడా ఉంది. వాటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. పైగా నాసిరకమైన మాత్రల వల్ల గర్భందాల్చు ప్రమాదాలు కూడా లేకపోలేదు. దీంతో ఎక్కువ శాతం మంది ప్రజలు కండోమ్స్‌నే ఆశ్రయిస్తున్నారు. ఎంతలా అంటే.. కొందరు ప్రజలు తమ  నెల జీతంలో సగం డబ్బులను వీటిని కొనుగోలు చేయడానికే కేటాయిస్తున్నారట.


Updated Date - 2022-07-09T18:33:06+05:30 IST